AP 10th Class SSC Results 2022 : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ విజయవాడలో ఈ రోజు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే గతంలో మార్కులకు బదులు గ్రేడులు ప్రకటించే విధానాన తీసుకువచ్చారు. పిల్లలు ఒత్తిడిని తగ్గించడానికి ఇంకా కార్పొరేట్ పాఠశాల ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేయడానికి గతంలో గ్రేడ్ల విధానాన్ని అనుసరించారు.
AP 10th class results 2022 : ఏపీలో నేడే పదో తరగతి ఫలితాలు విడుదల…ఇలా మీ ఫలితాన్ని చూసుకోండి….
AP SSC Results 2022 మార్కుల విధానం లోనే ఫలితాలు…..
అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆర్మీ, ఇతర ఉద్యోగాలు ఇంక పైచదువులకోసం మార్కుల అవసరం అవుతున్న నేపథ్యంలో గ్రేడ్ల విధానాన్ని పక్కనపెట్టి మళ్లీ మార్కులతో కూడిన ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఫలితాలు https: //bse.ap.gov.in లో అందుబాటులో ఉంచానున్నారు. ఫలితాల విడుదల తరువాత జులై మొదటి లేదా రెండవ వారంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశాలు వున్నాయి.
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు జరుగగా మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారు.