Pawan Kalyan: నిన్న జరిగిన 10వ జనసేన ఆవిర్భావ సభలోపవన్ కళ్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. ఏపీ రాజకీయాలను ఏపీ ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించారు. ఏపీ జరుగుతున్న ప్రతి అంశాన్ని వివరిస్తూ, దానికి తాను ప్రయత్నాలను చెప్తూ, అలాగే ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ప్రజల ఎందుకు మౌనంగా ఉన్నారన్న విషయాన్నీ కూడా ప్రస్తావించారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చెయ్యలేని ప్రభుత్వాలపైన, ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఏమాత్రం పోరాటానికి సిద్ధపడని రాష్ట్రప్రజలు మీద, తానూ ప్రత్యేక హోదా కోసం పోరాటానికి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర తనను ఒంటరివాణ్ణి చేశారని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ యువతలో ఎందుకు పోరాట పటిమ లోపించిందో కూడా సభలో చెప్పుకొచ్చారు.
కులాల చట్రంలో ఇరుక్కుపోయారు
ప్రత్యేక హోదా కోసం తాను ఉద్యమం చెయ్యడానికి సిద్ధపడ్డప్పుడు రాష్ట్ర ప్రజలు తనకు పట్టించుకోలేదని, ఇక్కడ ఉన్న యువత కూడా తనకు అండగా నిలబడలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఉద్యయం తెలంగాణలో జరిగి ఉంటే, అక్కడి యువత గొంతులు కోసుకొని ముందుకు తీసుకెళ్లేవారని, ఇక్కడి యువత కులం అనేచట్రంలో ఇరుక్కుపోయారని, అందుకే వాళ్లకు రాష్ట్రం కోసం పోరాడాలన్న ఉద్దేశం లేదని పవన్ చెప్పారు. ఈ విషయం చాల కరెక్ట్. ఎందుకంటే ఏపీలో ఉన్న యువతకు కులపిచ్చి పీక్స్ లో ఉంటుంది. ఏపీ యువతకు వాళ్ళ కులం వాడు రేపులు చేసిన సపోర్ట్ చేసేంత మూర్ఖత్వం ఉంటుంది. ఏపీ యువతలో ఉన్న కులపిచ్చికి ఇప్పటికే చల్లఁ ఉదాహరణలు ఉన్నాయ్.
తెలంగాణాలో కూడా పోటీ చేస్తారా!!
పవన్ కళ్యాణ్ కు తెలంగాణపై కూడా చాలా ప్రేమ ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పాడు. అయితే త్వరలో తెలంగాణాలో కూడా పోటీ చేస్తామని విషయాన్నీ ఇండైరెక్ట్ గా చెప్పారు. అయితే గతంలో GHMC ఎన్నికల్లో పోటీ చేస్తామన్నప్పుడు బీజేపీ నాయకులే తమకు అడ్డుపడ్డారని, నేను తెలంగాణ వాడిని కాదని, నన్ను వద్దన్నారు. అయితే తానూ భారతీయుడినని, తెలంగాణాలో కూడా పోటీకి సిద్ధపడుతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. తానూ ఏపీకి రాకుండా తెలంగాణాలోకి వెళ్లుంటే అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకునే వాళ్ళని, అక్కడి ప్రజలకు కులపిచ్చి లేదని, వాళ్లకు తెలంగాణ అనే భావం ఎక్కువగా ఉందని చెప్పాడు.