Aparna: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం అలాగే సినీ సెలబ్రిటీలు కూడా బాహ్య ప్రపంచానికి బాగా వస్తుండడంతో వీరికి అలాగే నెటిజన్లకు ఈ మధ్య దూరం బాగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సినీ సెలెబ్రెటీలు బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఆకతాయిలు వారితో ఆసభ్యకరంగా ప్రవర్తించడం అలాగే తాకడం వంటివి చేస్తున్నారు. దీంతో కొంతమేర సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. కాగా తాజాగా తమిళ ప్రముఖ హీరోయిన్ అపర్ణ బాలమురళి విషయంలో కూడా ఇదే జరిగింది. ఓ యువకుడు షేక్ హ్యాండ్ ఇచ్చే నెపంతో ఆమెను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే నటి అపర్ణ బాలమురళి మలయాళంలో తనకం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్ కి వెళ్ళింది. ఈ క్రమంలో ఓ యువకుడు నటి అపర్ణ బాలమురళికి కరచాలనం చేసే నెపంతో ఆమె వద్దకు వచ్చాడు. దీంతో అపర్ణ బాలమురళికి ఇష్టం లేకపోయినప్పటికీ యువకుడు తన వద్దకు వచ్చినందుకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. అయితే ఆ యువకుడు అంతటితో ఆగకుండా ఏకంగా అపర్ణ ని తాను కూర్చున్న చోటు నుంచి లేపి ఏకంగా భుజం మీద చెయ్యి వేసే ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించాడు.

దీంతో ఈ సంఘటనలో అపర్ణ బాల మురళి కొంతమేర అసౌకర్యానికి గురైంది. అలాగే ఆ యువకుడు నుంచి సున్నితంగా తప్పించుకుంది. ఇది గమనించిన కొందరు అక్కడున్నవారు ఈ సంఘటనని సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. దీంతో కొందరు నెటిజెన్లు యువకుడు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార. అంతేకాకుండా ఇలాంటి సంఘటనల కారణంగానే చాలామంది సినీ సెలబ్రిటీలు బాహ్య ప్రపంచానికి రావాలంటే భయపడుతున్నారని అలాగే ఇష్టం లేకుండా ఇలాంటి పనులు చేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య ఉన్నటువంటి అపర్ణ బాలమురళి తమిళంలో నటించిన సురారై పొట్రు చిత్రం ఏకంగా నేషనల్ అవార్డ్స్ మరియు ఆస్కార్ అవార్డుకి కూడా నామినేట్ అయింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానం చేసేటటువంటి పలు ఇతర అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే ఎప్పటినుంచో నటి అపర్ణ బాలమురళి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ సురారై పొట్రు చిత్రంలోని బేబమ్మ పాత్రకి మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అపర్ణ బాలమురళి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.