AR Rahman: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ అభినందనలు తెలియజేశారు.ఇలా రెహమాన్ వర్మకు అభినందనలు తెలపడానికి వర్మ అంత గొప్ప ఘనకార్యం ఏం చేశారనే విషయం గురించి పెద్ద ఎత్తున నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. ఇలా వర్మ కు రెహమాన్ అభినందనలు తెలియజేయడానికి ఓ కారణం ఉంది.
తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్మ మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత, వర్మపై యూజీసీకి, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఇలా ఒకవైపు వర్మ వ్యవహార శైలి పై మహిళా మండలి సంఘం నేతలు మండిపడుతూ ఉండగా రెహమాన్ మాత్రం అభినందనలు తెలిపారు. అయితే ఈయన అభినందనలు తెలపడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వర్మకు తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ను యూనివర్సిటీ వారు అందించిన విషయం మనకు తెలిసిందే.
AR Rahman:
ఇలా వర్మ విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. 1985 లోఈయన ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారు. ఇలా ఈయన ఇంజనీరింగ్ పూర్తి అయ్యి 37 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందుకోలేదు. ఈ క్రమంలోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తనకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందించడంతో ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియా వేదికగా తెలియ చేస్తూ ఇంజనీరింగ్ అయిపోయిన 37 సంవత్సరాలకు డిగ్రీ అందుకోవడం సంతోషంగా ఉంది థాంక్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ను పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఏఆర్ రెహమాన్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ కంగ్రాట్స్ రాము గారు అంటూ ట్వీట్ చేయగా వెంటనే వర్మ స్పందిస్తూ సర్ థాంక్యూ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.