Arthi agarwal : ఆర్తి అగర్వాల్..టాలీవుడ్‌లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పరిచయమైంది. తెలుగు సినిమాలలో అవకాశం రావడంతో అమెరికా నుంచి ఇండియాకొచ్చింది. విక్టరి వెంకటేశ్ – కె. విజయ భాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్‌లోనే ఆర్తి అగర్వాల్ నువ్వు లేక నేను లేను చేసింది. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.

arthi-agarwal-will do that work at 10 o'clock
arthi-agarwal-will do that work at 10 o’clock

దాంతో ఈమె కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగింది. చిన్న వయసులోనే యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఇంద్ర, నేనున్నాను లాంటి సినిమాలతో పాటు ప్రభాస్ సరసన అడవి రాముడు, జూనియర్ ఎన్.టి.ఆర్ సరసన అల్లరి రాముడు. ఉదయ్ కిరణ్ సరసన నీ స్నేహం, తరుణ్‌తో నువ్వులేక నేను లేను, సోగ్గాడు వంటి సినిమాలు చేసింది. ఈమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ సాధించాయి. ఫస్ట్ మూవీతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారడంతో నిర్మాతలకి లక్కీ హీరోయిన్‌గా నిలిచింది.

Arthi agarwal : యూత్‌కి కలలరాణిగా క్రేజ్ సంపాదించుకుంది.

ఇక యూత్‌కి కలలరాణిగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక బయట ప్రాంతం వారికి, విదేశాల నుంచి వచ్చిన వారికి హైదరాబాద్ ధమ్ బిర్యాణి అంటే ఎంతో ఇష్టం. అందులోనూ ప్యారడైజ్ బిర్యాని, అక్కడ దొరికే టీ-కాఫీలంటే అమితంగా ఇష్టపడతారు. వీరిలో ఆర్తి అగర్వాల్ కూడా ఉంది. ఆర్తి అగర్వాల్ షూటింగ్ ముగించుకొని ప్రతీరోజూ తప్పనిసరిగా డిన్నర్ అయ్యాక 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కి వచ్చి కాఫీ, లేదా టీ తాగే అలవాటు ఉండేదట. అప్పట్లో ఇది ఆమెకి ఒక అలవాటుగా మరిందని ప్రచారం జరిగింది. రాత్రి ఇక్కడ కాఫీ తాగాకే రిలాక్స్డ్‌గా నిద్రపోయేదట.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 26, 2021 at 8:24 సా.