Ashu Reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అషు రెడ్డి అనే పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా డబ్ స్మాష్ ద్వారా మంచి ఫాలోయింగ్ పెంచుకున్న ఈ అమ్మడు ఆ క్రమంలోనే బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక తన అందంతో ఈ ముద్దుగుమ్మ అడపదడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.
ఆ మధ్య ఆర్జీవి తో కలిసి ఈ అమ్మడు ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియా మొత్తాన్ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక పుష్ప లో సమంత చేసిన ఒక స్పెషల్ సాంగ్ ను కవర్ సాంగ్ రూపంలో ఈ అమ్మడి కూడా టేస్ట్ చేసేసింది. మొన్నటి వరకు యూట్యూబ్ లో ఈ ముద్దుగుమ్మ చేసిన కవర్ సాంగ్ బాగా హడావిడి చేసింది. ఇక అగ్ర స్థాయి సెలబ్రేటీలు సైతం ఆమెను చూసి ఫిదా అవ్వాల్సిందే.
ఇక అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆరబోస్తుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ఓటీటీ వెర్షన్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో ఎంపికైన సంగతి మనకు తెలుసు. ఇక హౌస్ లో తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్ లో కంటెస్టెంట్ లకు తలుపు తట్టిన ప్రేమ అనే టాస్క్ ఇచ్చారు.

Ashu Reddy: అషు రెడ్డి ని తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ కిస్ చేసేవాడు!
ఇక దీంట్లో భాగంగా అషు రెడ్డి తన ఫస్ట్ లవ్ గురించి తెలిపింది. నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి తో రిలేషన్ లో ఉన్నాను అన్నట్లు తెలిపింది. అంతేకాకుండా నేను కలిసినప్పుడు అతడు నా నుదిటి పై ముద్దు పెట్టాడు అని తెలిపింది. అలా కొంత కాలం చాలా ఎంజాయ్ చేసాము అన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరి గురించి ఇంట్లో తెలిసాక తన ఇంటి నుంచి చాలా కాలం బయటకు పంపలేదు అని తెలిపింది.
ఆ తర్వాత యూఎస్ కు వెళ్లి ముందు ఎంబీఏ పూర్తి చేసుకొని రమ్మని వాళ్ళ అమ్మానాన్నలు చెప్పారట. ఆ విషయం తన బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పానని ఇక తనుకూడా వస్తానని కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కే సమయంలో నన్ను ఫ్లైట్ ఎక్కించి తను అక్కడే ఆగిపోయి హ్యాండ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత కొంత కాలానికి తన బాయ్ ఫ్రెండ్ అషు రెడ్డి కి సెట్ కాడు అని గ్రహించుకుంది. ఇక తన ప్రేమ విషయం అంతా ఎప్పటికప్పుడు తన ఫ్రెండ్ తో పంచుకునేదట. ఒక రోజు తన బాయ్ ఫ్రెండ్ తనను అలా చేస్తున్నాడని అనడంతో తన ఫ్రెండ్ తనకు బ్రేక్ అప్ చెప్పమని చెప్పిందట. ఇక తన ఫ్రెండ్ చెప్పగానే అషు రెడ్డి బ్రేకప్ చెప్పింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే అషు రెడ్డి తన ప్రేమ విషయం పంచుకున్న ఫ్రెండ్ నే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.