Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని సెలబ్రిటీగా మారిన వారిలో అశు రెడ్డి ఒకరు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఎంతో క్రేజ్ దక్కించుకొని పలు అవకాశాలను అందుకని సెలబ్రిటీ గా మారిపోయారు.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తిరిగి బిగ్ బాస్ ఓటీటీ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ విధంగా ఆశు రెడ్డి రెండు సీజన్లలో పాల్గొన్నప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకొందరి కంటెస్టెంట్ ల మధ్య ఏర్పడిన స్నేహబంధం బయటకు వచ్చినా కూడా కొనసాగిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, ఆశు,స్రవంతి, అజయ్ వంటి వారి మధ్య మంచి రిలేషన్ కొనసాగింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ వీరిమధ్య ఇదే బాండింగ్ ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్రవంతి, అజయ్ ఆశు రెడ్డి కలిసే సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. ఈ ముగ్గురు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాలో ఈ ముగ్గురు చేస్తున్న అల్లరికి సంబంధించిన ఓ వీడియోని అశు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతోంది.

Ashu Reddy: తాగినట్టు రచ్చ చేస్తున్న బిగ్బాస్ బ్యూటీస్….
ఈ వీడియోలో భాగంగా ఆశు రెడ్డి, స్రవంతి బీరు సీసాలు పట్టుకొని బీరు తాగుతూ, బీచ్ లో తూలుతూ ఉన్నట్టు నటించారు. ఇక వీరిద్దరితో పాటు అజయ్ సైతం వీరితో కలిసి రచ్చ చేశారు. ఇలా కార్ డ్రైవింగ్ చేస్తూ మద్యం తాగినట్టు నటిస్తూ వీరి అల్లరి మామూలుగా లేదని చెప్పాలి. మొత్తానికి ఈ వీడియోలో ఆశు, స్రవంతి తాగుబోతులు తిరుగుబోతుల మాదిరిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ ఇలా బాగా తాగి డ్రైవ్ చేస్తూ అమాయకులను చంపేయండి అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.