Ashu Reddy: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా బాగా ఫేమస్ అయిన అషు రెడ్డి కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అషురెడ్డి ని ఆమె అభిమానులు బుల్లితెర సమంత అని కూడా పిలుస్తూఉంటారు. ఇక అషు రెడ్డికి ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. కాగా అషు ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.
ఇది ఇలా ఉంటే తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ చేసి ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి వచ్చిన తరువాత అషు రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా రాహుల్, అషు ఇద్దరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరూ తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌కు ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటారు.
Ashu Reddy: అతని ఒళ్లో కూర్చున్న అషు రెడ్డి..
ఇది ఇలా ఉంటే తాజాగా వీళ్లిద్దరు వారి సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఫొటోను షేర్ చేశారు. వారు షేర్ చేసిన ఫోటోలో రాహుల్ ఒడిలో అషు రెడ్డి కూర్చుని కనిపించింది. అయితే రాహుల్, అషు రిలేషన్‌లో ఉన్నామని ప్రకటించుకున్న తర్వాత రాహుల్ సిప్లీగంజ్, అషు రెడ్డి ఇక్కడికి వెళ్లిన ఇద్దరూ జంటగానే కనిపిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ ఫొటోను షేర్ చేయడంతో పాటు లవ్ సింబల్‌ను కూడా పెట్టారు. దీంతో వీళ్ల బంధం ఉన్న అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.
View this post on Instagram