Samantha: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ఉచితం సమంతా తెలుగు,తమిళం, హిందీ భాషల సినిమాలలో నటిస్తోంది. కాగా ఇటీవలే సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో తన రేంజ్ మరింత పెరిగింది. విడాకుల తరువాత సమంత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో యశోద సినిమా కూడా ఒకటి.
ఈ సినిమాకు ద్వయం హరి హరీష్ లు వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో సమంత యాక్షన్స్ సన్నీ వేషాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయట. అంతేకాకుండా సమంత ఆ యాక్షన్స్ సన్నీవేషాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టులో విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా సమంత నటిస్తున్న మరొక చిత్రం శాకుంతలం. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఈ సినిమా కంటే ముందుగా యశోద సినిమాని విడుదల చేయనున్నారు.
Samantha: 2024 వరకు సమంత టైం బాగుంది..
ఇది ఇలా ఉంటే తాజాగా శాకుంతలం సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సమంత గురించి మాట్లాడుతూ.. 2024 వరకు సమంత టైమ్ బాగుంటుందని, సమంత నటించిన శాకుంతలం ఆమె కెరీర్ కు మరింత ప్లేస్ కానుంది అని తెలిపారు వెళ్లి స్వామి. కాగా సమంత,నాగచైతన్య విడాకుల వ్యవహారం సమయంలో వారిద్దరు విడిపోతారు అని నేను ముందే చెప్పాను అంటూ వేణు స్వామి చేసిన వాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరొకసారి సమంత కెరీర్ పై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కనుక నిజమైతే సమంత సినిమాల లిస్టులో మరికొన్ని వచ్చి చేరతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.