Bahubali : బాహుబలి..ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంతటిదో చూపించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ళుగా ఉన్న రికార్డ్స్ మాత్రమే ఇక పై ఎవరు బ్రేక్ చేయలని సరికొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. దర్శక ధీరుడు అనే బిరుదుని రాజమౌళికి ఇచ్చింది. పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి తీసుకు వచ్చి పెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి బిగినింగ్, బాహుబలి కన్‌క్లూజన్ ఒక చరిత్ర సృష్టించాయి. బాహుబలి తర్వాత మనం కూడా హాలీవుడ్ సినిమా స్థాయికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు రాజమౌళి.

bahubali is not a great movie says Kota srinivas rao

హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్స్ కూడా రాజమౌళి సత్తాని పొగిడారు. ఇలాంటి డైరెక్టర్ హాలీవుడ్ సినిమా చేయగలడనే ప్రశంసలు ఎంతో ప్రముఖుల నుంచి దక్కించుకున్నాడు. ఆయన దర్శకత్వ ప్రతిభ కి ఎలాంటి లిమిటేషన్స్ లేవని ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి గొప్ప దర్శకుడిని ఒక సీనియర్ ప్రముఖ నటులు మాత్రం విమర్శించారు. ఆయనే కోట శ్రీనివాస్ రావుగారు. బాహుబలి లాంటి సినిమాను ఆ కాలంలోనే చేశారని..రాజమౌళి కంటే గొప్ప దర్శకులు ఆ రోజుల్లోనే ఉన్నారని ఓపెన్ గా చెప్పారు.

Bahubali : మామూలు కథకు నాలుగేళ్ళు సమయం వందల కోట్లు బడ్జెట్ పెట్టడం దండగ..!

అసలు బాహుబలి కథ ఏంటని ..సూటిగా ప్రశ్నించిన కోట గారు..ఒక మామూలు కథకు నాలుగేళ్ళు సమయం వందల కోట్లు బడ్జెట్ పెట్టడం దండగ అని కామెంట్ చేశారు. హాలీవుడ్ స్థాయి సినిమా అంటున్నారు. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో మాయాబజార్, కీలుగుర్రం, పాతాళ భైరవి, జగన్మోహిని లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారని ఇదే టెక్నాలజీ అప్పుడు ఉంటే బాహుబలి కంటే పదిరెట్లు గొప్ప సినిమా తీసే దర్శకులు అప్పుడే ఉన్నారని అభిప్రాయపడ్దారు. కోట మాటలను నిజంగానే సమర్ధించే వారున్నారు. బాహుబలి సినిమా నచ్చని వారు ఉన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 31, 2021 at 2:36 సా.