Bank holidays in May 2022: మే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా…!

S R

Bank holidays in May 2022 : ప్రతి నెలా బ్యాంకులకు కొన్ని సెలవుదినాలు ఉంటాయి. ఆర్బిఐ ప్రతినెలా బ్యాంకులకు సెలవు దినాలను నిర్ణయిస్తుంది. ఈ బ్యాంకు సెలవు దినాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటాయి.బ్యాంకులకు పనుల నిమిత్తం వెళ్లేవారు బ్యాంకులు సెలవు దినాలు గురించి తెలుసుకొని వెళ్లడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు సెలవు ఉంటుందో తెలుసుకోకుండా వెళ్లి ఇబ్బంది పడటం కంటే పక్కా ప్రణాళికతో ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ సంవత్సరం మే నెలలో ఆర్బిఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే మే నెలలో బ్యాంకులకు ఎప్పుడు ఏ రాష్ట్రాలలో ఉంటాయో తెలుసుకుందాం.

Bank holidays in May 2022 మే నెలలో బ్యాంకు సెలవులు….

మే నెల మొత్తం 11 రోజులు సెలవులు కాగా, ఈసారి మే నెల సెలవు తో ప్రారంభం కానుంది. మే నెల రోజులు ఇలా ఉన్నాయి….

మే 1 : మే డే – బ్యాంకులు దేశవ్యాప్తంగా క్లోజ్‌లోనే ఉంటాయి. అందులోను ఆదివారం.

మే 2 : కొచ్చి మరియు తిరువనంతపురంలోని బ్యాంకు ఉద్యోగులు ఈద్-ఉల్-ఫితర్ సెలవుదినాన్ని పాటిస్తారు.

మే 3 : అగర్తల, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,గ్యాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, లక్నో, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, పనాజీ, రాయ్‌పూర్, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకు ఉద్యోగులు సెలవులో ఉంటారు. ఈ రోజున కొచ్చి మరియు తిరువనంతపురంలో బ్యాంకులు తెరిచి ఉంటాయి.

మే 8 : ఆదివారం – వీక్లీ హాలిడే.

మే 9 : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఉంటుంది.

మే 14 : నెలలో రెండవ శనివారం – ఈ రోజున బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఉంటుంది.

మే 15 : ఆదివారం – వీక్లీ హాలిడే.

మే 16 : బుద్ధ పూర్ణియ కారణంగా అగర్తల, బేలాపూర్, చండీగఢ్, భోపాల్, డెహ్రాడూన్, జమ్మూ, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 22 : ఆదివారం – వీక్లీ హాలిడే

మే 28 : నెలలో నాల్గవ శనివారం – ఈ రోజు బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 29 : ఆదివారం – వీక్లీ హాలిడే.

- Advertisement -