Mahesh Vitta: యూట్యూబర్ గా చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వారిలో మహేష్ విట్టా ఒకరు ఈయన ఫన్ బకెట్ అనే కామెడీ వెబ్ సిరీస్ తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఈ విధంగా మహేష్ విట్టా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తాజాగా పుష్ప సినిమాలో కేశవ పాత్రలో కూడా నటించే అవకాశం తనకే రావడం అయితే కొన్ని కారణాలవల్ల ఈ అవకాశాన్ని వదులుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా మహేష్ విట్టా ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఘనంగా వివాహం చేసుకున్న సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ రెండవ తేదీన ఈయన శ్రావణి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా ప్రొద్దుటూరులో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్న ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ విట్టా గత కొంతకాలంగా శ్రావణితో ప్రేమలో ఉన్నారని సంగతి మనకు తెలిసిందే.
చెల్లెలు స్నేహితురాలని పెళ్లి చేసుకున్న మహేష్…
శ్రావణి స్వయంగా మహేష్ చెల్లెలు స్నేహితురాలు కావడం విశేషం ఇలా కొంతకాలంగా శ్రావణితో ప్రేమలో ఉన్నటువంటి మహేష్ వారి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ ఎంతో ఘనంగా సెప్టెంబర్ రెండవ తేదీ వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు నెటిజన్స్ మహేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.