Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో అక్కినేని నాగార్జున ఒకరు. ప్రస్తుతం ఈయన ఆరు పదుల వయస్సులో ఉన్నప్పటికీ ఎంతో చలాకీగా వరుస సినిమాలు చేస్తూనే, బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి లహరి ఇప్పటికే పలుసార్లు నాగార్జునను కలిసి అతనితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో తనదైన శైలిలో తన ఫర్ఫార్మెన్స్ చూపించిన లహరి బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే నాగార్జునను కలిసిన లహరి ఆయనతో ముచ్చటించిన అనంతరం నాగార్జునతో డ్రైవింగ్ కి కూడా వెళ్ళింది. లహరి కార్ లో నాగార్జున డ్రైవ్ చేస్తూ ఉండగా అతని పక్కన లహరి కూర్చుని అతనితో పాటు డ్రైవింగ్ కి వెళ్లారు.ఈ క్రమంలోనే కారులో నాగార్జునతో కలిసి దిగిన ఫోటోలను లహరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nagarjuna: ఏ మాత్రం తగ్గని లహరి…
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా నాగార్జునతో మంచి పరిచయం ఏర్పడటంతో లహరి తరచు నాగార్జునని కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి నాగార్జునను కలుసుకున్న ఈమె ఆయన ఎంతో అద్భుతంగా తనని రిసీవ్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇలా నాగార్జునతో కలిసి సెల్ఫీకి ఫోజులిచ్చిన లహరి ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాగార్జునను కలుసుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు లహరి వ్యవహారంపై విభిన్న శైలిలో కామెంట్లు చేస్తున్నారు. లహరి వ్యవహారం చాలా దూరం వెళుతోంది అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
It was pleasure for me to meet Nagarjuna Sir ! 🤗 I felt glad with his hospitality. Such a genuine and humble person!! 🙂#nagarjunaakkineni #happyday #positivethoughts #lifeisbeautiful #tollywood #hyderabad #biggbosstelugu
Blouse : Designer : @adamohyd pic.twitter.com/8xqbww12gT
— Lahari Shariᅠᅠᅠ (@laharishari) May 8, 2022