Bindu Madhavi కొంతమంది నటీనటులకు అందం, అభినయం నటన ప్రతిభ ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాక గుర్తింపు నోచుకోలేక పోయిన నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇందులో తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ బిందు మాధవి కూడా ఒకరు. కాగా బిందు మాధవి తెలుగులో ఆవకాయ్ బిర్యానీ అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది. ఆ తర్వాత సెగ, రామ రామ కృష్ణ కృష్ణ, అలాగే మరిన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాల వల్ల నటి బిందుమాధవి సినీ కెరీర్ ఏమాత్రం మలుపు తిరగలేదు. దీంతో బిందుమాధవి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆఫర్లు కరువయ్యాయి. చివరకు చేసేదేమిలేక ఈ అమ్మడు తమిళ సినీ పరిశ్రమకు వలస వెళ్లింది. కానీ తమిళ చలన చిత్ర పరిశ్రమలో మాత్రం నటి బిందుమాధవి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.
అయితే తాజాగా నటి బిందు మాధవి ప్రముఖ ఓటీటీ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఓట్ ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అప్పటినుంచి నటి బిందు మాధవి గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో మరియు చలన చిత్ర పరిశ్రమలో తెగ చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా బిందుమాధవి ఆస్తిపాస్తులు మరియు సినీ కెరీర్ గురించి నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో మరియు ఇంటర్నెట్ లో తెగ వెతుకుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నటి బిందు మాధవి ఆస్తుల విలువ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే తాజాగా బిగ్ బాస్ టైటిల్ గెలవడంతో నటి బిందు మాధవికి దాదాపుగా 50 లక్షల రూపాయలు ముట్టినట్లు సమాచారం. ఇందులో మళ్ళీ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ చేసినందుకు సపరేట్ రెమ్యూనరేషన్ కూడా పుచ్చుకుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించే అవకాశం వరించినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాకుండా తమిళం, మలయాళం తదితర భాషలలో కూడా దాదాపుగా 7 పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.