Ram charan: బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో సావాసం చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఉమైర్ సందు గురించి డైలీ సోషల్ మీడియా ని ఫాలో అయ్యేవారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐతే ఉమైర్ సందు ఎప్పుడూ కుడా తనకి తాను గా సినీ క్రిటిక్ అని ఫీల్ అవుతూ ఎదో ఒక సినిమా పై లేదా సినీ సేలేబ్రేటీలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటాడు. కాగా నిన్న మొన్నటివరకూ ఉమైర్ సందు కేవలం బాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖలను మాత్రమే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవాడు. కానీ గత కొద్ది రోజులుగా ఉమైర్ సందు టాలీవుడ్ ని టార్గెట్ కొందరు హీరోలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు.
అసలు విషయంలోకి వెళితే తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పై కుడా తాజాగా ఉమైర్ సందు పలు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసాడు. ఇందులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మరియు సినీ నిర్మాత ప్రియాంక చోప్రాతో అక్రమ సంబంధం అంటగడుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేసాడు. అలాగే ప్రియాంక చోప్రా రామ్ చరణ్ పై మనసు పడిందని అంతేగాకుండా వీరిద్దరూ కలసి ముంబై లోని ఓ ప్రముఖ హోటల్ లో ఏకాంతంగా కలుసుకున్నారని రాశాడు.
అలాగే ఈ సంఘటన ప్రియాంక చోప్రా మరియు రామ్ చరణ్ ఇద్దరూ కలసి 2012వ సంవత్సరంలో జంజీర్ చిత్రంలో నటిస్తున్న సమయంలో జరిగిందని కుడా ఈ ట్వీట్ లో పేర్కొన్నాడు. దాంతో మెగా అభిమానులు ఉమైర్ సందు చేసిన ఈ పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మధ్య టాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరుగుతోందని ఈ విషయన్ని ఓర్వలేక ఉమైర్ సందు ఇలాంటి తఃప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ మధ్య ఉమైర్ సందు ఆగడాలు మరింతగా పెరుగిపోతున్నాయని సినీ సెలబ్రేటీలపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఉమైర్ సందుపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.