Iliyaana : ఇలియానాకి బాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడని తను కలిపించే అవకాశాలే చెబుతున్నాయి. టాలీవుడ్‌లో ఇలియానా స్టార్ హీరోయిన్‌గా ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా సెటిలయింది. పెద్ద నిర్మాణ సంస్థలు…స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసే అవకాశం అందుకుంది. టాలీవుడ్ లో మేకర్స్ ఇలియానా తప్ప మరో పేరు తమ ప్రాజెక్ట్స్‌కి పరిశీలించే వారు కాదు. అంతగా ఇల్లీ బేబీ తన గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్‌తో క్రేజ్ సంపాదించుకుంది.

bollywood star supports iliyaana...!
bollywood star supports iliyaana…!

అయితే కొత్త హీరోయిన్స్ రావడం..అదే సమయంలో ఫ్లాప్స్ రావడం.. లవ్‌లో పడటంతో తెలుసు సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి. మళ్ళీ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేసిన హిట్ కాకపోవడంతో ఇక అవకాశాలు రాక కనిపించడం లేదు. అయితే టాలీవుడ్ మీద మాత్రం ఇలియానాకి ఇంకా ఆసక్తి ఉంది. ఇక్కడ సినిమా అవకాశాలు వస్తే వెంటనే చేసేందుకు రెడీగా ఉంది. ఆ మధ్య బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ – ఇలియానా జంటగా నటించిన రైడ్ సినిమాని తెలుగులో నాగార్జున రీమేక్ చేయబోతున్నాడని తెలుగు వెర్షన్‌లో కూడా ఇలియానా నటించబోతుందని వార్తలు వచ్చాయి.

Iliyaana : ఇలియానాకి బాలీవుడ్‌లో మాత్రం మంచి క్రేజ్ ఉంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఏదీ రాలేదు. కాగా ఇలియానాకి బాలీవుడ్‌లో మాత్రం మంచి క్రేజ్ ఉంది. అక్కడ అజయ్ దేవగన్ మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. తను నిర్మించే సినిమాలతో పాటు తను హీరోగా నటించే సినిమాలలోనూ ఇలియానాకి అవకాశాలిస్తున్నాడు. అలా బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ ఇస్తూ నటించబోతున్న రుద్రలో కీలక పాత్రకోసం ఇలియానాకి అజయ్ దేవగన్ అవకాశం ఇచ్చాడట. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 2, 2021 at 9:47 సా.