boy requests people to wear mask video viral
boy requests people to wear mask video viral

Viral Video : ప్రస్తుతం భారతదేశం సెకండ్ వేవ్ తో అల్లాడుతోంది. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. సెకండ్ వేవ్ ప్రమాదం తప్పినట్టే ఇక. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదు. అందుకే.. అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని.. శానిటైజర్లు వాడలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే.. సెకండ్ వేవ్ ముప్పు తగ్గింది అని తెలియగానే.. బయటికి వెళ్తున్న వాళ్లు మాస్క్ ను ధరించడం లేదు. చాలామంది మాస్కులు ధరించకుండానే మార్కెట్లకు వెళ్లడం, బయట తిరగడం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా జనాలు తిరుగుతున్నారు. ఇలా చేస్తే అతి త్వరలోనే మళ్లీ మూడో వేవ్ దేశంలో వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.

boy requests people to wear mask video viral
boy requests people to wear mask video viral

ఇక.. టూరిస్ట్ ప్రాంతాలు అయితే పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది పర్యాటకులు కరోనా నిబంధనలనే ఉల్లంఘించేస్తున్నారు. హోటళ్లు ఫుల్ అయిపోతున్నాయి. ఏ పర్యాటక ప్రాంతంలో చూసినా జనాలే. అయితే.. జనాలు పర్యాటక ప్రాంతాలకు వెళ్తే వచ్చిన సమస్య ఏం లేదు కానీ.. వాళ్లు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతో లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Viral Video : హిమాచల్ ప్రదేశ్ కు చెందిన చిన్నారి వీడియో వైరల్

హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్ అని అందరికీ తెలుసు కదా. అక్కడి ధర్మశాలకు కూడా ఈసారి టూరిస్టులు పోటెత్తారు. అయితే.. అక్కడ ఎవ్వరూ కరోనా నిబంధనలను పాటించడం లేదు. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. దీంతో.. ఓ బాలుడు.. కర్ర పట్టుకొని రోడ్డు మధ్యలో నిలబడి.. మాస్క్ ధరించండి.. అంటూ అందరినీ వేడుకుంటున్నాడు. కానీ.. ఆ బాలుడిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నారికి ఉన్న బాధ్యత మీకు లేదా? మాస్క్ పెట్టుకోకపోతే.. మనకే నష్టం. చిన్నారి చెబుతున్నా కూడా వినకుండా.. దారి వెంట మాస్క్ లేకుండానే గుంపులు గుంపులుగా జనాలు నడిచి వెళ్తుంటే.. వాళ్లను చూసి.. నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 7, 2021 at 11:25 ఉద.