CCL: ఇండియాలో ఉన్న అన్ని మూవీ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరు కలిసి “సెలెబ్రెటీ క్రికెట్ లీగ్”ను ఏర్పాటు చేసుకొని, క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 18 నుండి ఈ లీగ్ ప్రారంభమైంది. మొదటగా బెంగాల్ టైగర్స్ అండ్ కర్ణాటక బుల్డోజర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఈ సీజన్లో ఫైనల్ కు చేరుకుంది. నిన్న కర్ణాటక బుల్డోజర్స్ అండ్ తెలుగు వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ గెలిచి ఫైనల్స్ కు చేరుకున్నారు. ఇప్పటికే భోజ్ పూరి దబాంగ్స్ VS ముంబై హీరోస్ మధ్య జరిగిన మ్యాచ్ లో భోజ్ పూరి దబాంగ్స్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది. ఇప్పుడు తెలుగు వారియర్స్ అండ్ కర్ణాకట మధ్య జరిగిన తోలి మ్యాచ్ లో కర్ణాటక హీరోస్ 6 వికెట్స్ కోల్పోయి 99 రన్స్ చెయ్యగా, తెలుగు హీరోస్ 6 వికెట్స్ కోల్పోయి, 95 రన్స్ చేశారు.

తరువాత జరిగిన రెండో ఇన్నింగ్స్ లో కర్ణాటక హీరోస్ 5 విక్కెట్ల నష్టానికి 95 రన్స్ చెయ్యగా, తెలుగు హీరోస్ నాలుగు వికెట్స్ నష్టానికి 105 రన్స్ చేశారు. దింతో తెలుగు వారియర్స్ ఫైనల్స్ కు చేరుకున్నారు. నిన్న కర్ణాటక హీరోస్, తెలుగు హీరోస్ మధ్య జరిగిన మ్యాచ్ లో హీరో సామ్రాట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. అలాగే ఈ మ్యాచ్ హీరో రోషన్ కూడా చాలా మంచిగా ఆడిండు. మ్యాచ్ ఫైనల్స్ కి వెళ్లడంలో తమన్, రోషన్ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ,మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ… ఫైనల్స్ లో కప్పు గెలిచి, హీరో అఖిల్ కు ఇస్తానని చెప్పారు. ఈ సీజన్లో తమన్ చాల మంచిగా ఆడాడు.
అయితే ఈరోజు భోజ్ పూరి దబాంగ్స్ వైస్ తెలుగు వారియర్స్ మధ్య మ్యాచ్ Dr YS Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnamలో జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ ఫైనల్స్ మ్యాచ్ ను వీక్షించడానికి హీరో అక్కిని నాగార్జున, విక్టరీ వెంకటేష్ రానున్నారని సమాచారం. ఈసంవత్సరం కూడా తెలుగు వారియర్స్ గెలుస్తారేమో చూడాలి.
డేట్ అండ్ టైం: మార్చ్-25th, సాయంత్రం 7గంటలకు
వెన్యూ: Dr YS Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam
భోజ్‌పురి దబాంగ్స్: మనోజ్ తివారీ (కెప్టెన్), రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్, రామ్ ప్రవేశ్ యాదవ్, ఉదయ్ తివారీ, అజోయ్ శర్మ, విక్రాంత్ సింగ్, ఆదిత్య ఓజా, ప్రకాష్ జైస్, అయాజ్ ఖాన్, శైలేష్ సిన్హా, వైభవ్ రాజ్, అస్గర్ రషీద్ ఖాన్, వికాస్ సింగ్ , అక్బర్ నఖ్వీ, గజేందర్ ప్రతాప్ ద్వివేది, జై ప్రకాష్ యాదవ్, రాజ్ చోహన్, పవన్ సింగ్, బాబీ సింగ్, ప్రదీప్ పాండే, యశ్ కుమార్
తెలుగు వారియర్స్: అఖిల్ అక్కినేని (కెప్టెన్), వెంకటేష్, సచిన్ జోషి, సుధీర్ బాబు, తరుణ్, ప్రిన్స్ సిసిల్, సాయి ధరమ్ తేజ్, అజయ్, ఈఎస్‌డి, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నందకిషోర్, నిఖిల్, సిద్దార్థ్, ప్రభు, రఘు, సుశాంత్, శ్రీకాంత్, తారక రత్న, సామ్రాట్ రెడ్డి, విశ్వ