CBN: చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతలా దిగజారడంటే… వెయ్యి మంది కూడా నడవడానికి సరిపోనీ రోడ్ లో రోడ్ షో పెట్టి, అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారిని కూడా తన రాజకీయ స్వార్ధం కోసం వాడుకుంటున్నాడు. అక్కడ చనిపోయిన వారు తానూ చేస్తున్న ఉద్యమం కోసం సమిధలు అయ్యారని, వారు రాష్ట్రం కోసం చనిపోయారని బాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చావులను కూడా తన అధికారం కోసం వాడుకోవడం ఏంటని సోషల్ మీడియా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయినా తన ప్రజాబలం చూపించుకోవడానికి ఇరుకుగా ఉన్న రోడ్ లో ప్రచారం చేస్తూ, ఆ ప్రజల చావుకు కారణమైందే కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చావును కూడా ఇలా ఎన్నికల కోసం వాడుకుంటున్నారు. చేసిన తప్పును ప్రజల ముందు ఒప్పుకోకుండా ఇలా చెయ్యడం ఎందుకని విమర్శలు వస్తున్నాయి.
బాబు ఇంతలా దిగజారాలా!!
వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావడానికి బాబు చెయ్యనిది అంటూ ఏమి లేదు. ఇప్పుడు సీఎం కావడం కోసం ఎవరినన్నా చంపామన్నా చంపేలా ఉన్నారు. ఇప్పటికే అధికారం కోసం జనసేనతో, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా ఇప్పుడు జనాల చావును కూడా తన అధికారం కోసం వాడుకుంటున్నారు. కనీస ఆలోచన లేకుండా చిన్న రోడ్ లో షో పెట్టడం వల్లే జరిగిన తొక్కిసలాటలో వాళ్ళు చనిపోతే సిగ్గు లేకుండా తానూ చేస్తున్న ఉద్యమం కోసం చనిపోయారని చెప్పుకుంటున్నాడు. వాళ్ళు చావుకు ఎక్కడ వైసీపీ వాళ్ళు తన మీదకు వేస్తుందో అని ముందే ఇలా నాటకం మొదలు పెట్టాడు.
జనసేన ప్రశ్నించాదా!!
ప్రజల కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని, సరికొత్త రాజకీయాలు చేస్తానని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్, ఇలా ఒక నిర్లక్ష్యపు రోడ్ షో ప్రజలు చనిపోతే దానికి కారణమైనా చంద్రబాబు నాయుడును ప్రశ్నించకుండా, జస్ట్ చనిపోయిన వారికి సానుభూతి తెలిపాడు. ఒకవేళ ఇలా జనాలు వైసీపీ సభలో చనిపోయి ఉంటే పవన్ ఖచ్చితంగా ఇలా స్పందిచే వాడు కాదు. ఆ నిందను వైసీపీ మీదకు నెట్టేవాడు. ఇప్పుడు అక్కడ జరిగిన సభ టీడీపీది కాబట్టి పవన్ ఏమి అనడం లేదు. పవన్ కూడా ఇలా చనిపోయిన వాళ్ళతో రాజకీయాలు చెయ్యడం ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అధికారం కోసం నాయకులు ఎంతకైనా దిగజారుతారని బాబును, పవన్ కళ్యాణ్ ను చూస్తే అర్థమైతుంది.