Chiranjeevi: కొరటాల గత చిత్రాలను నమ్మి మోసపోయిన చిరు..ఇది నిజమేనా..?

G K

Chiranjeevi: మన స్టార్ హీరోలు కొందరు సక్సెస్‌లలో ఉన్న దర్శకులను పట్టుకొని హిట్ కొట్టాలనే ప్లాన్స్ బాగా వేస్తుంటారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ఎక్కువగా చెప్పుకుంటుంటారు. కొత్త దర్శకుడైనా, సీనియర్ దర్శకుడైనా సక్సెస్‌లలో ఉంటే మహేశ్ ఆ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తాడని అంటుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అదే చేసి ఆచార్య ఫ్లాపవడానికి మెగాస్టార్ కారణం అయ్యారా అంటే..ఇప్పుడు అదే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తన సినిమాకే కాదు మిగతా మెగా హీరోల కోసం కూడా కథ ఫైనల్ చేసే బాధ్యత భుజాన వేసుకుంటున్నారు.

ఆయన గనక 100 డేస్ అను సినిమా ప్రివ్యూ చూసి చెబితే అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ, మనం గమనిస్తే ఆచార్య సినిమా చూసిన చిరు ఆ మాట చెప్పలేదని తెలిసిపోతుంది. అంటే ఆచార్య రిజల్ట్ మెగా హీరోలకు ముందే తెలుసా..? అంటే ఇప్పుడు అందరూ అవుననే మాట్లాడుతున్నారు. కొరటాల శివ ముందు రచయితగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ రకంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో దర్శకుడు కాకముందు నుంచే మంచి రిలేషన్ మేయింటైన్ చేస్తూ వచ్చాడు. అలా ముందు దర్శకుడుగా ప్రభాస్‌తో మిర్చి సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.

chiranjeevi believed koratala blindly
chiranjeevi believed koratala blindly

Chiranjeevi: ఇక్కడే ఆయన రాంగ్ స్టెప్ వేశారు అని క్లియర్‌గా అర్థమవుతుంది.

మొదటి సినిమా భారీ హిట్. ఆ తర్వాత మహేశ్‌తో తీసిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్.టి.ఆర్‌తో తీసిన జనతా గ్యారేజ్ వరుసగా హిట్ సాధించాయి. ఇదే మెగాస్టార్‌ను కొరటాలతో సినిమా చేయాలనే ఆతృతను రేకెత్తించింది. ఇక్కడే చిరు రాంగ్ స్టెప్ వేశారని అంటున్నారు. వాస్తవంగా ఆచార్య లాంటి కథ అన్నీ భాషలలో వచ్చి బాగా అరిగి, నలిగిందే. అలాంటి కథను చిరు ఎలా ఒప్పుకున్నారూ అంటే… అంతకముందు కొరటాల అందుకున్న సక్సెస్‌లను చూసే అన్న విషయం అర్థమవుతుంది. ఇదే విషయాన్ని చిరు కూడా పదే పదే చెప్పారు. ఇక్కడే ఆయన రాంగ్ స్టెప్ వేశారు అని క్లియర్‌గా అర్థమవుతుంది.

- Advertisement -