Rambha : ఈ వెటరన్ హీరోయిన్ విడాకుల విషయంలో ఆ స్టార్ హీరో హెల్ప్ చేశాడట..

Joythi R

Rambha : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి కుర్రకారు మతి పోగొట్టిన బ్యూటిఫుల్ వెటరన్ హీరోయిన్ రంభ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి రంభ ఎక్కువగా తన సినీ కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి దాదాపుగా నాలుగు చిత్రాల్లో కనిపించింది. అలాగే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇక హీరోయిన్ గా కెరియర్ ముగిసిపోయిన సమయంలో కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాథన్ అనే ఓ ప్రముఖ వ్యాపార వేత్తని ప్రేమించి 2010 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండే వాళ్లు. దీంతో వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

కానీ ఏమైందో ఏమో గాని పెళ్లయిన ఏడు సంవత్సరాల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు మొదలయ్యాయి. దీంతో నటి రంభ 2018 సంవత్సరంలో తన భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో తన పిల్లల సంరక్షణ కూడా తనే తీసుకుంది. కానీ తన పిల్లల సంరక్షణ మరియు భరణంగా నెలకి 10 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆమె భర్త ఇంద్రన్ పద్మనాథన్ కూడా ఇందుకు అంగీకరించి ఆమె అడిగిన భరణాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

Chiranjeevi : ఈ వెటరన్ హీరోయిన్ విడాకుల విషయంలో ఆ స్టార్ హీరో హెల్ప్ చేశాడట..
Chiranjeevi : ఈ వెటరన్ హీరోయిన్ విడాకుల విషయంలో ఆ స్టార్ హీరో హెల్ప్ చేశాడట..

కానీ విడాకుల తర్వాత నటి రంభ తన ముగ్గురు పిల్లలని పెంచేందుకు అష్టకష్టాలు పడింది. మరోపక్క తన పిల్లలను పోషించేందుకు డబ్బు సరి పోకపోవడం మరియు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వంటి వాటి కారణంగా మళ్లీ తన భర్తతో కలిసి ఉంటానని విడాకులు రద్దు చేయాలని కోరింది. కానీ నటి రంభ తో కలిసి ఉండేందుకు మొదట్లో ఇంద్రన్ పద్మనాథన్ అంగీకరించలేదు. దీంతో వీరిద్దరి విడాకుల రద్దు విషయంలో మెగాస్టార్ చిరంజీవి కలగజేసుకొని నచ్చచెప్పాడట. అలాగే రంభ కి కూడా మరో మారు లైఫ్ లో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడట. దాంతో ఇంద్రన్ పద్మనాథన్ కూడా తన భార్య నటి రంభతో కలిసి జీవించడానికి ఒప్పుకున్నాడట.

Chiranjeevi : ఈ వెటరన్ హీరోయిన్ విడాకుల విషయంలో ఆ స్టార్ హీరో హెల్ప్ చేశాడట..
Chiranjeevi : ఈ వెటరన్ హీరోయిన్ విడాకుల విషయంలో ఆ స్టార్ హీరో హెల్ప్ చేశాడట..

దీంతో ప్రస్తుతం వీరిద్దరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా నటి రంభ కి ఇటీవలే ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం వచ్చినప్పటికీ తన పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం మరియు తన భర్తకి బిజినెస్ లో హెల్ప్ చేయడం వంటి వాటితో బిజీగా ఉండటంతో సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

- Advertisement -