Chiranjeevi : చిరంజీవి కెరీర్ ప్రారంభం నుంచి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకున్నారు. హీరో పాత్రల కోసమే ఎదురు చూడలేదు. చిన్న చిన్న పాత్రల్లోనే నటించి తనని తాను నిరూపించుకున్నారు. తనకంటూ గుర్తింపు వచ్చాక రెండు, మూడు షిఫ్టుల్లో సినిమాలు చేశారు. వరుసగా అవకాశాలు వస్తుండటంతో అతి కొద్ది కాలంలోనే స్టార్ అయ్యారు. ఆయనతో సినిమా తీయాలని దర్శక, నిర్మాతలు డేట్స్ కోసం పోటీపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక అంతటి క్రేజ్ వచ్చిన చిరంజీవి ఏనాడు డేట్స్ కావాలని వచ్చిన దర్శక, నిర్మాతలకి నో చెప్పలేదు.

chiranjeevi-movie created 500 days record
chiranjeevi-movie created 500 days record

అప్పటికే కమర్షియల్ హీరోగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాంటి సమయంలో కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వాలంటే ససేమిరా అంటారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర అసోసియేట్‌గా చేసిన కోడి రామకృష్ణ దర్శకుడిగా మారుతూ ఒక సినిమా చేయాలని కథ సిద్దం చేసుకున్నాడు. తరంగిణి పేరుతో ఈ సినిమా అప్పటి ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్స్ నిర్మించాలనుకున్నారు. కానీ అది ఆగిపోయింది. దాంతో మరొక కథ రెడీ చేశాడు. ఈ కథ గురువుగారు దాసరి నారాయణరావుకి, నిర్మాత ప్రతాప్ గారినికి చెప్పారు కోడి రామకృష్ణ.

Chiranjeevi : మెగాస్టార్ కెరీర్‌లో ఇన్ని రోజులు ఆడిన ఒకే ఒక్క సినిమా ఇదే.

ఇద్దరికి నచ్చింది. హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. ఏమాత్రం ఆలోచించకుండా చిరంజీవి గారు అనుకుంటున్నానని చెప్పారు. చిరంజీవి దగ్గర కథ చెప్పడానికి టైం తీసుకొని వెళ్ళి కథ చెప్పారు. ఆయనకి కథ నచ్చింది గానీ కథలో ఆయన పాత్ర నచ్చలేదు. అయితే ఇందులో ఉన్న పూర్ణిమ క్యారెక్టర్ చిరంజీవికి విపరీతంగా నచ్చిందట. ఇదే విషయాన్ని దర్శకుడు కోడి రామకృష్ణకి చెప్పి ఓకే చెప్పారు చిరు. ఆ సినిమానే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. విడుదలయ్యాక ఈ సినిమా 500 రోజులకి పైగా ప్రదర్శింపబడింది. మెగాస్టార్ కెరీర్‌లో ఇన్ని రోజులు ఆడిన ఒకే ఒక్క సినిమా ఇదే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 27, 2021 at 7:20 సా.