Rajanikanth : దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలకి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. గతంలో వీరు కలిసి స్క్రిన్ షేర్ కూడా చేసుకున్నారు. ఒకరు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా వెలుగుతుంటే ఒకరు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా వెలుగుతున్నారు. రేంజ్ అండ్ రెమ్యునరేషన్ పరంగానే కాకుండా అన్నీ విషయాలలోను ఎవరికి వారే సాటి. అయితే రజనీకాంత్ సినిమాల పరంగా ఎపుడు తన దూకుడు తగ్గించలేదు. కానీ మెగాస్టార్ మాత్రం రాజకీయాలలోకి వెళ్ళడం వల్ల ఓ పదేళ్ళు సినిమాలకి బ్రేక్ ఇచ్చారు.

chiranjeevi-not-listened-to-rajinikanth

ఈ పదేళ్ళలో అభిమానులు మెగాస్టార్‌ని మళ్ళీ సినిమాలు చేయమని, సినిమాలలోకి రమ్మని అడిగిన సందర్భాలు ఎన్ని వందలుంటాయో లెక్కచెప్పడం కష్టమే. అయితే అప్పుడుడప్పుడు తనయుడు రాంచరణ్ సినిమాలలో కొన్ని క్షణాలు కనిపించి అభిమానులను అలరించడమే నేను మళ్ళీ వస్తున్నా..అనే సంకేతాలు పంపారు. జస్ట్ టైమ్ గ్యాప్..టైమింగ్‌లో అస్సలు గ్యాప్ ఉండదు ఆయన చెప్పిన డైలాగ్ మాదిరిగా ఖైదీ నంబర్ 150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు.

Rajanikanth : రజనీకాంత్..చిరంజీవితో మీరు ఒక్కసారి శంకర్ డైరెక్షన్‌లో చేయాలి.

అయితే క్రియేటివ్ జీనియస్ దర్శకత్వంలో ఏ స్టార్ హీరోయినా నటించాలనుకుంటారు. ఆయనే శంకర్. రోబో ఫంక్షన్‌లో స్వయంగా రజనీకాంత్..చిరంజీవితో మీరు ఒక్కసారి శంకర్ డైరెక్షన్‌లో చేయాలి. మీరు అలా ఉంటే చాలు అన్నీ ఆయనే చేసుకుంటారు అని చెప్పారు. శంకర్ – చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎన్నో సందర్భాలలో వార్తలు వచ్చాయి. కానీ ఈ కాంబినేషన్ సెట్ అవలేదు. పబ్లిక్ ఫంక్షన్‌లో రజనీకాంత్ అంతటివారు చిరుని కోరినా ఆయన..శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేయలేకపోవడానికి కారణం ఎందుకు కుదరలేదనేది అర్థం కాని విషయం. అయితే ఇప్పుడు రాం చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ సినిమా రూపొందనుంది. అందులో చిరు కనిపించే అవకాశాలున్నాయంటున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 21, 2021 at 9:16 ఉద.