Chiranjeevi: నీకేం బాసు.. క్రికెట్ టీమ్ ఉంది.. చెర్రీ, కళ్యాణ్ కాకపోతే ఎవరొకరు.. మెగాస్టార్ పై ట్రోల్స్?

Akashavani

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆర్య సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో సినిమా విశేషాలను, వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆశక్తికరమైన సమాధానాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ఒక విలేకరి ప్రశ్నిస్తూ ఆశ్చర్య సినిమాలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కి బదులుగా, పవన్ కళ్యాణ్ నటించిన ఉంటే ఎలా ఉండేది అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు మెగాస్టార్ ఆసక్తికరమైన సమాధానం వెల్లడించారు.ఈ ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం చెబుతూ ఒకవేళ రామ్ చరణ్ ఈ సినిమాలో సిద్ధ పాత్రకు ఒప్పుకోకపోయి ఉంటే ఆ పాత్రలో మరే హీరో చేసిన ఆ పాత్రకు వందశాతం న్యాయం చేయగలరు.అయితే సిద్ధ పాత్రలో రామ్ చరణ్ నటించడం నాకు ఎంతో ప్రత్యేకత అతనితో కలిసి నటించిన ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉందని,ఈ పాత్రలో చరణ్ చేయడం వల్ల తండ్రీకొడుకుల బంధానికి మరింత ప్లస్ అవుతుందని చిరంజీవి తెలియజేశారు.

Chiranjeevi: పవన్ తో చేసిన ఆ ఫీలింగ్ వచ్చేది…

ఇక ఈ పాత్రలో రామ్ చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన తనతో కూడా నాకు ఇలాంటి ఫీలింగ్ ఉండేదని, పవన్ కళ్యాణ్ కూడా ఈ పాత్రకు ఎంతో పర్ఫెక్ట్ గా సరిపోయేవారని మెగాస్టార్ తెలియజేశారు. ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన నాకు 100% చరణ్ తో చేసిన ఫీలింగ్ ఉండేది.కానీ పవన్ కళ్యాణ్ కు చరణ్ అంత ఛాన్స్ ఇవ్వలేదు. చరణ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు అంటూ మెగాస్టార్ సిద్ద పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వ్యాఖ్యల పై ట్రోల్ చేస్తున్నారు. నీకేంటి బాసు ఇంట్లో క్రికెట్ టీమ్ లాగా హీరోలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ కాకుంటే మరొక హీరోతో అయినా చేస్తారు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -