Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి – నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలో ఎంత సీనియర్ హీరోలో ప్రతేకంగా చెప్పనవసరం లేదు. ఒకరు స్వయంకృషితో హీరో అయితే ఒకరు సీనియర్ హీరో నందమూరి తారకరామారావు ఇన్స్పిరేషన్‌తో ఇండస్ట్రీకొచ్చి కామెడి చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఎడ్యుకేషన్ పరంగా చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు మంచి క్వాలిఫికేషన్ ఉన్నవారే. వీరు ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు చెన్నై ( అప్పటి మద్రాసు ) లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. అది దేవదాస్ కనకాల గారి యాక్టింగ్ స్కూల్.

chiranjeevi-Rajendra prasad journey started at Devadas kanakala acting school
chiranjeevi-Rajendra prasad journey started at Devadas kanakala acting school

అక్కడే చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. చిరంజీవి కంటే రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ సీనియర్. మైం యాక్టింగ్ లో రాజేంద్రప్రసాద్ పట్టా పొందారు. అప్పుడు పరిచయమయిన వీరు ఆ తర్వాత చాలా సినిమాలలో కలిసి నటించారు. కెరీర్ పరంగా ఇద్దరి స్టార్ డం వేరయినప్పటికీ ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రాజేంద్రప్రసాద్ ను చిరంజీవి రాజా, ప్రసాదు అని పిలిస్తే చిరంజీవిని రాజేంద్రప్రసాద్ ..ప్రసాద్, చిరు అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

Chiranjeevi : వీరి మధ్య ఉన్న క్లోజ్‌నెస్ చాలా తక్కువ మందికే తెలుసు.

ఇండస్ట్రీలో వీరి మధ్య ఉన్న క్లోజ్‌నెస్ చాలా తక్కువ మందికే తెలుసు. ఇద్దరు కలిసి సాయంత్రాలు గడుపుతుంటారు. ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా తప్పనిసరిగా హాజరవుతారు. కానీ బయటవాళ్ళకి వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్‌నెస్ గురించి పెద్దగా తెలీదు. ఇక మెగా హీరోలు నటిస్తున్న చాలా సినిమాలలో రాజేంద్రప్రసాద్ కచ్చితంగా కనిపిస్తుంటాడు. అలా చిరంజీవి, రాజేంద్రప్రసాద్ అంతక ముందు ఒకరికి ఒకరు పరిచయం లేకున్నా..దేవదాసు కనకాల గారి యాక్టింగ్ స్కూల్ లో పరిచయం అయి మంచి స్నేహితులుగా మారారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 16, 2021 at 8:52 సా.