Chiranjeevi: త్వరలోనే మెగా కాంపౌండ్ లో పెళ్లి భాజలు మోగబోతున్నాయనే సంగతి మనకు తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వివాహం జరగనుంది. ఈ వివాహం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల సమక్షంలో తనని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.
ఇక త్వరలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతుందనే విషయం తెలియడంతో వీరి పెళ్లి విషయంలో చిరంజీవి మెగా బ్రదర్ నాగబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. మరి నాగబాబుకు చిరంజీవి ఇచ్చిన వార్నింగ్ ఏంటి అనే విషయానికి వస్తే.. నిహారిక పెళ్లి చేసుకొని రెండు సంవత్సరాలు కూడా గడవకముందే తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే నిహారిక విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె పెళ్లి నిశ్చయించిన ముహూర్తానికి జరగకపోవడమే కారణమని తెలుస్తుంది.
సరైన ముహూర్తంలోనే పెళ్లి జరగాలి…
ఇలా ముహూర్తం దాటిపోయిన తర్వాత వెంకట చైతన్య నిహారిక మెడలో మూడు ముళ్ళు వేశారు. తద్వారా ఆమె వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేదు అన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నిహారిక పెళ్లి విషయంలో జరిగిన ఈ తప్పు వరుణ్ పెళ్లి విషయంలో జరగకూడదని చెప్పారట సరైన ముహూర్తానికి మాంగల్య ధారణ జరిగే లాగా ఏర్పాటు చేసుకోవాలని ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటూ చిరంజీవి నాగబాబుకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.