Chiranjeevi: ఒకపక్క మేము చనిపోతుంటే.. మీకు ఫ్యామిలీ ట్రిప్ అవసరమా అంటూ చిరుపై ఫైర్!

Akashavani

Chiranjeevi: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ఒక ముద్రవేసుకున్నాడు చిరు. ఇక చిరంజీవి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

మొత్తానికి చిరు టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒక్కడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. గత కొంత కాలంగా సినీ సినిమాలకు దూరంగా ఉంటున్న చిరు ప్రస్తుతం ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో చిరు కొడుకు రామ్ చరణ్ తేజ్ సిద్ధ పాత్రలో నటించాడు. ఇక తండ్రి కొడుకు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాబట్టి అప్పట్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.

కానీ ఇటీవల విడుదలయ్యాక ఈ సినిమాకు చాలావరకు నెగిటివ్ టాక్ నడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక కలెక్షన్ల రూపంలో కూడా చాలా వెనుకబడి ఉందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కొంచెం డల్ గా ఉందని తెలుస్తుంది. ఇక బయ్యర్లకు ఇచ్చిన మాట కొరటాల శివ నిలుపుకోలేకపోయాడు.

ఇక నిర్మాత నిరంజన్ రెడ్డి విషయానికొస్తే బయ్యర్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇక బయ్యర్లకు మిగిలిన దిక్కు చిరంజీవి మాత్రమే కాగా ఆచార్య బయ్యర్లు గత నాలుగు రోజులుగా చిరంజీవి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం తన ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ వెళ్ళినట్లు తెలుస్తుంది.

Chiranjeevi: బయ్యర్లు చిరంజీవి పై ఈ విధంగా ఆవేశ పడుతున్నారు!

ఇక బయ్యర్లు తిరిగి వచ్చాక చూసుకుందాంలే.. అని లైట్ తీసుకున్నారు. కానీ చిరంజీవి నెల రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బయ్యర్లు అంతా మేము ఇక్కడ చనిపోతుంటే.. నీకు సరదాలు కావాలా అన్నట్టు ఆవేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -