Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 10 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన 60 ఏళ్ళు దాటినా అదే క్రేజ్..అదే వాడి, అదే వేడి..మాస్ అంటే మెగాస్టార్. ఎన్ని బంపర్ హిట్స్ ఇచ్చినా ఇంకా ఆయన నుంచి సినిమాలు కావాలి..రావాలి. అయినా మెగా అభిమానులకు తనివి తీరదు. ఆయన డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్నయ్య ఏం చేసినా పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఆయన రీ ఎంట్రీ ఇచ్చాక సైరా అనే పాన్ ఇండియన్ సినిమా చేశారు. పాన్ ఇండియన్ స్టార్‌గా ఆయన సత్తా చూపించారు.

combo of chiranjeevi prabhas pan indian movie

ప్రస్తుతం వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. కొరటాల శివతో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ తర్వాత సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజాతో లూసీఫర్ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత మెహర్ రమేష్, బాబిలతో చేయనున్నారు. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆయన చేస్తున్న నాలుగు సినిమాలు ఇప్పుడు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతున్నవే. ఆదిపురుష్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు.

Chiranjeevi : 2022లో మెగాస్టార్ చిరంజీవి – పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ల పాన్ ఇండియన్ సినిమా..?

అయితే 2022లో మెగాస్టార్ చిరంజీవి – పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లతో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ – వంశీ – ప్రమోద్ – ప్రసీద నిర్మిచనున్నారట. ప్రభాస్ కమిటయిన రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ సినిమాలలో 2022 వరకు 3 ప్రాజెక్టులు పూర్తవుతాయట. ఆ తర్వాత మెగాస్టార్ – ప్రభాస్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొదలైతే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 7, 2021 at 7:05 సా.