saiee manjrekar : సయి మంజ్రేకర్ బాలీవుడ్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. బాలీవుడ్ నటుడు..దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నట వారసురాలిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సయి మంజ్రేకర్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. కరోనా ఎఫెక్ట్ గనక లేకపోతే సయి మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ గత ఏడాదే ఉండాల్సింది. అయితే ఈ ఏడాది మాత్రం మిస్ అవకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.

craze-increases-about-saiee-manjrekar-in-tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌లో క్షణం, గూడఛారి, ఎవరు..లాంటి విభిన్నమైన సినిమాలతో వరస హిట్స్ అందుకున్న అడవి శేష్ ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు తో పాటు ఇతర సౌత్ భాషల్లలో కూడా పాన్ ఇండియన్ సినిమాగా మేజర్ సిద్ధం అవుతోంది. ఇక ఈ సినిమా జులై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో సయి మంజ్రేకర్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఇటీవల ఈ సినిమా నుంచి సయి మంజ్రేకర్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

saiee manjrekar : సయి మంజ్రేకర్ కి టాలీవుడ్‌లో వరసగా అవకాశాలు రావడం పక్కా అని తెలుస్తోంది.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి జంటగా గని సినిమాలో నటిస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి సయి మంజ్రేకర్ షూటింగ్ లో పాల్గొంటుంది. సయి మంజ్రేకర్ ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాక్సర్ గా నటిస్తున్న వరుణ్ తేజ్ కాలేజ్ స్టూడెంట్ అయిన సయి మంజ్రేకర్ తో ప్రేమలో ఎలా పడతాడన్నది ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కాగా సయి మంజ్రేకర్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ స్టార్ హీరోలు తన మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంటే టాలీవుడ్‌లో సయి మంజ్రేకర్ కి వరసగా అవకాశాలు రావడం పక్కా అని తెలుస్తోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 20, 2021 at 9:31 ఉద.