Devatha May 12 Episode: రుక్మిణి బతికే ఉందని తెలుసుకున్న భాగ్యమ్మ.. ఆదిత్యను కౌగిలించుకున్న రాధ!

Akashavani

Devatha May 12 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రాధ గుడిలో ఆదిత్య తో మాట్లాడుతూ వుండగా అక్కడకు మాధవ వచ్చి వారి మాటలకు పుల్స్టాప్ పెడతాడు. అంతేకాకుండా రాధకు చెయ్యి కాలిన విషయాన్ని తను ఆసరాగా తీసుకొని ఆ విషయాన్ని ఆదిత్యకు మరోలా చెబుతాడు. ఇక గుడిలో ఇలా ఆఫీసర్ దగ్గరికి వచ్చి మాట్లాడటం సరైనది కాదు అని.. ఎవరైనా చూస్తే మరోలా అనుకుంటారు అని తన చెయ్యి పట్టుకొని అక్కడినుంచి వెళ్తాడు. వెనుకకు చూడకు అంటూ తనను లోపలికి తీసుకొని వెళ్ళాడు.

సీన్ కట్ చేస్తే..

గుడిలో రామమూర్తి దంపతులు పూజలు చేస్తూ ఉంటారు. ఇక రాధ మీ పక్కన కూర్చోకుండా చేతిని కాల్చుకుంటే దానిని ఆసరాగా తీసుకొని నా పెనిమిటి తో అలా చెబుతావా అంటూ బాధపడుతుంది. ఆ మాటకు పెనిమిటి ఎంత బాధ పడుతున్నాడు అని లోలోపల కుమిలి పోతూ ఉంటుంది. ఇక ఆదిత్య కారులో ప్రయాణిస్తూ అక్కడ ఏదో జరుగుతుంది అన్నట్లుగా ఆలోచిస్తాడు.

హాస్పిటల్ కు వెళ్లాలనుకుంటున్న ఆదిత్య..

ఇక పిల్లల గురించి ఆలోచిస్తూ మాధవ చిన్మయిని ఇవ్వడానికి కారణం ఏంటి అనుకుంటూ చిన్నయి పుట్టిన తేదీ బట్టి తెలుసుకోవచ్చు అని వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి అని అనుకుంటాడు. మరోవైపు రాధ తల్లి భాగ్యమ్మ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అలా చాలా దూరం వెళ్లాక తనకు ఎండ కొట్టడంతో నీడకు వెళ్లి ఉపశమనం కలిగించుకుంటుంది.

షాక్ లో రుక్మిణి తల్లి..

ఇక అక్కడే రాధ ఫోటో చూసి రుక్మిణి అంటూ బాగా ఎమోషనల్ అవుతూ కనిపిస్తుంది. బతికే ఉన్నావా బిడ్డ అనుకుంటూ బాగా కుమిలిపోతుంది. కాసేపు రాధ ఫోటోను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న మాధవ ఫోటో ని చూసి షాక్ అవుతుంది. మాధవ సార్ ఏంటి.. ఇక్కడ ఏమి రాసారు అని ఒక అబ్బాయి ని పిలిపించి అది చదువుపిస్తుంది. దాంతో భాగ్యమ్మ షాక్ అవుతుంది.

ఇక రాధ జరిగిన విషయాన్ని తలచుకుని ఈ ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటుంది. వెంటనే తన గదిలోకి వెళ్లి తన బట్టలు, పిల్లల బట్టలు సర్దుకుంటుంది. అప్పుడే అక్కడికి మాధవ వచ్చి ప్రశ్నించటంతో రాధ ఓ రేంజ్ లో కోపంతో రగిలిపోతూ మాధవ పై అరుస్తూ కనిపిస్తుంది. నా పెనిమిటి బాధ పెడుతున్నావు అంటూ కుమిలిపోతుంది.

Devatha May 12 Episode: రుక్మిణి బతికే ఉందని తెలుసుకున్న భాగ్యమ్మ.. ఆదిత్యను కౌగిలించుకున్న రాధ!
Devatha May 12 Episode: రుక్మిణి బతికే ఉందని తెలుసుకున్న భాగ్యమ్మ.. ఆదిత్యను కౌగిలించుకున్న రాధ!

Devatha May 12 Episode: ఆదిత్యను కౌగిలించుకున్న రుక్మిణి..

తరువాయి భాగంలో రాధ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండగా భాగ్యమ్మ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఇక రాధ తన తల్లి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మాధవ తనను మళ్లీ తన మాటలతో బాధ పడుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి ఆదిత్య రావటంతో వెంటనే రాధ ఆదిత్యను చూసి పెనిమిటి అంటూ ఎమోషనల్ అవుతూ కౌగిలించుకుంటుంది.

- Advertisement -