Devatha May 13 Episode: తల్లితో బాధలు పంచుకున్న రుక్మిణి.. రాధతో తన ఫీలింగ్స్ పంచుకుంటున్న మాధవ!

Akashavani

Devatha May 13 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రాధ తన తల్లి భాగ్యమ్మ ఒడిలో పడుకొని బాగా ఎమోషన్ అవుతూ కనిపిస్తుంది. అంతేకాకుండా తన అత్తగారి ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాలన్ని చెబుతుంది. దాంతో భాగ్యము ఆ మాధవ పనిచేస్తానని కోపంతో రగిలి పోతూ ఉండగా వెంటనే రాధ ఆపుతూ.. మళ్లీ ఏడుస్తూ నా బిడ్డ ఆయన తండ్రి అని, వాళ్లే తన అవ్వ తాత అని అనుకుంటుంది అని అంటుంది.

దాంతో భాగ్యమ్మ ఏమి అనలేక బాధపడుతూ ఉంటుంది. నీ పరిస్థితి ఏంటి అని దిగులు చెందుతుంది. మన ఇంటికి రా బిడ్డ అని భాగ్యమ్మ అనడంతో త్వరలో వస్తాను అన్నట్లుగా చెబుతుంది. ఇక నీకేం జరిగినా నేను ఉంటాను అని బిడ్డకు ధైర్యాన్ని ఇస్తుంది భాగ్యమ్మ. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లాలని వెళ్తుండగా బిడ్డను వదిలి ఉండలేక మళ్లీ పట్టుకొని ఎమోషనల్ అవుతుంది.

సీన్ కట్ చేస్తే.

పిల్లలిద్దరూ స్కూల్ నుంచి హడావిడిగా వస్తారు. అప్పుడే మాధవ వచ్చి ఏం జరిగిందని అడగటంతో వెంటనే పిల్లలు తమ కోసం అవ్వ స్పెషల్ రెడీ చేస్తా అన్నది అంటారు. ఆ తరువాత దేవి తను అలిసిపోయాను అని తన తల్లికి దగ్గరకు వెళ్తుంది. మరోవైపు సత్య కమలకు దగ్గరుండి జ్యూస్ తాపిస్తూ ఉంటుంది. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది.

సత్య విషయంలో బాధపడుతున్న కమల..

దాంతో కమల సత్యకు అమ్మ అయ్యే అదృష్టం లేదు అని దిగులు చెందుతూ ఉండగా సత్య కాస్త ఎమోషనల్ అయి అక్కడి నుంచి వెళ్తుంది. మరోవైపు రాధ తన తల్లి తో మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దేవి రావటంతో దేవి తనకు దిగులుగా ఉంది అని అంటుంది. దాంతో రాధ ఏం జరిగింది అని అనడంతో మాతృ దినోత్సవం సందర్భంగా దాని గురించి రాయమన్నారు అని చెబుతోంది.

బిడ్డను పట్టుకొని ఎమోషనల్ అవుతున్న రాధ..

దాంతో రాధ నువ్వు మా అమ్మ వేనా అనే మాటను తలుచుకొని ఆ రోజు ఆ మాట అన్నావు కదా దానిని బట్టి రాయి అనడంతో ఆరోజు అలా అనడానికి కారణం ఏంటో చెబుతుంది దేవి. మళ్లీ ఈ మాట అనకు బిడ్డ అంటూ ఎమోషనల్ అవుతుంది. మనకు అమమ్మ లేదా అని అడగటంతో వస్తది అని ధైర్యం ఇస్తుంది. మరోవైపు భాగ్యమ్మ ఒక గుడి దగ్గర కూర్చొని రుక్మిణి పడుతున్న బాధలను దేవుడికి చెప్పుకొని బాధపడుతుంది.

Devatha May 13 Episode: తల్లితో బాధలు పంచుకున్న రుక్మిణి.. రాధతో తన ఫీలింగ్స్ పంచుకుంటున్న మాధవ!
Devatha May 13 Episode: తల్లితో బాధలు పంచుకున్న రుక్మిణి.. రాధతో తన ఫీలింగ్స్ పంచుకుంటున్న మాధవ!

Devatha May 13 Episode: తన ఫీలింగ్స్ ను బయట పెడుతున్న మాధవ..

తరువాయి భాగంలో మాధవ రాధ దగ్గరికి వచ్చి ఇంత వరకు నీ విషయంలో నా నుండి ఎటువంటి తప్పు జరగలేదు అని కానీ భుజం మీద చెయ్యి వేసిన రోజు అని తన ఫీలింగ్స్ గురించి చెబుతూ ఉండగా వెంటనే రాధ కోపం తో రగిలిపోతుంది. అప్పుడే ఆదిత్య రావటంతో ఆదిత్యను పట్టుకుని ఎమోషనల్ అవుతుంది.

- Advertisement -