NTR : ఎన్.టి.ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ నటించింది. ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజైంది. ఇందులో సమీరా రెడ్డితో పాటు అమీషా పటేల్ హీరోయిన్స్‌గా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. పెట్టుబడిలో సగానికి సగం కూడా రాబట్టలేకపోయింది. చెప్పాలంటే ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్. అంతక ముందు బాలకృష్ణతో సమరసింహారెడ్డి తీసి భారీ హిట్ తో పాటు ఊహించని బాక్సాఫీస్ వసూళ్ళు అందుకున్న చెంగల వెంకట్రావ్ దీనిని నిర్మించాడు.

అయితే నరసింహుడు భారీ డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరు వచ్చి నిర్మాత మీద పడ్దారు. కోట్లలో నష్టం రావడంతో చేసేదేమీ లేక నిర్మాత హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఓవర్ బడ్జెట్ కావడం ఇందుకు ముఖ్య కారణం. దర్శకుడు ఇచ్చిన బడ్జెట్ కి సినిమాకి అయిన బడ్జెట్ కి అసలు ఏమాత్రం పొంతన లేదు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కారణంగా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ముట్టజెప్పి అమీషా పటేల్ ని తీసుకు వచ్చారు. మేకర్స్ చేసిన పొరపాట్లలో ఇది కూడ ప్రధానమైనది.
NTR : అందరూ అమీషా పటేల్ గురించి మాట్లాడుతున్నారు.
అయితే రిలీజయ్యాక వివాదాలు చుట్టుముట్టుకోవడంతో ఎన్.టి.ఆర్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడు. సాధారణంగా ఏ హీరో కూడా ఇలా చేయడు. అంతేకాదు అప్పుడు వచ్చిన కొన్ని రూమర్స్ కి ఎన్.టి.ఆర్ ఘాటుగా స్పందించాడు. కథ కి తగ్గ బడ్జెట్ కేటాయించకుండా ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తే నేను ఎలా బాధ్యుడుని అవుతాను..అందరూ అమీషా పటేల్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్.టి.ఆర్ చెప్పాడా ..అమీషా పటేల్ కావాలని..అంటూ రియాక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఎన్.టి.ఆర్ తను నటించబోతున్న సినిమాల విషయంలో దర్శక, నిర్మాతలకి బడ్జెట్ గురించి చాలా ఖచ్చితంగా వ్యవహరించాలని సూచిస్తుంటాడు.