Dil Raju: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరున్న సినీ నిర్మాతలలో తెలుగు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఒకరు. కాగా నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పెద్ద బడ్జెట్ చిత్రాలను నిర్మించాడు. అయితే నిర్మాత దిల్ రాజు మొదటగా డిస్ట్రిబూటర్ గా కెరియర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత 200౩ వ సంవత్సరంలో ప్రముఖ హీరో నితిన్ హీరో గా నటించిన దిల్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి మంచి హిట్ కొట్టాడు. అయితే ఈ చిత్రం 3 కోట్ల రూపాయల బడ్జెట్ బడ్జెట్ తో తెరకెక్కించగా 11 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో డబుల్ ప్రాఫిట్ తో దిల్ చిత్రం మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇక అప్పటినుంచి వరుస చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోపక్క డిస్ట్రిబూటర్ గా కుడా కొనసాగుతున్నాడు.
అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. అయితే ఇందులో తానూ తన భార్య అనిత మరణించిన తర్వాత చాలా డిప్రెషన్ లోకి వేల్లిపోయనని తెలిపాడు. ఆ తర్వాత ఈ డిప్రెషన్ నుంచీ బయటపడటానికి తనకున్న గ్యాంబ్లింగ్ అలవాటు కారణంగా ఈ అట ఆడే వాడినని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో గ్యాంబ్లింగ్ అలవాటు కాస్తా వ్యసనంగా మారిందని దాంతో ఇది పసిగట్టిన తన కుటుంభ సభ్యులు తాను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని అలాగే తాను కుడా తోడు కోసం రెండో పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అయితే తన భార్య మరణం తర్వాత తాను తన కూతురు, అల్లుడితో కల్సి ఉన్నప్పటికీ తన భార్య అనిత తో గడిపిన క్షణాలు, జ్ఞాపకాల నుంచీ బయటికి రావటానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. అందుకే తేజస్విని ని మళ్ళీ వివాహం చేసుకున్నానని స్పష్టం చేసాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు తెలుగులో ప్రముఖ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు విలక్షణ దర్శకుడు శంకర్ తదితరుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ 15వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని దాదపుగా ౩౦౦ కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకేక్కిస్తునట్లు సమాచారం. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన 5 నిమిషాల ఫైట్ సన్నివేశం కోసం చిత్ర యూనిట్ సభ్యులు దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసారని వార్తలు వైరల్ అయ్యాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారోఅని…