Dil Raju: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి అలాగే ఆయన నిర్మించిన చిత్రాల గురించి దాదాపుగా తెలియని వారు ఉండరు. అయితే నిర్మాత దిల్ రాజు ఒక డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ని ఆరంభించి ఆ తర్వాత మెల్లమెల్లగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే దిల్ చిత్రం నిర్మించి మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస చిత్రాలను నిర్మిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే మంచి పేరున్న ప్రముఖ నిర్మాతరంలో ఒకడుగా రాణిస్తున్నాడు. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు కి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే ఇటీవలే నిర్మాత దిల్ రాజు మరియు తన రెండో భార్య అనిత కలసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా తమ పెళ్లి ఎలా జరిగిందనే విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో అనిత మాట్లాడుతూ తనకి పెళ్లికాకముందు తాను ఓ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలో పనిచేసే దానిని తెలిపింది. ఈ క్రమంలో తన భర్త దిల్ రాజు అప్పుడప్పుడు తాను పనిచేస్తున్న సమయంలోనే కొన్నిసార్లు కలిశాడని అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది.

ఇక మొదటి పరిచయంలో మొదటిగా దిల్ రాజు తనని పెన్ అడిగాడని అలా పెన్ అడగడంతో మొదలైన తమ పరిచయం పెళ్ళికి దారి తీసిందని చెప్పుకొచ్చింది. అయితే దిల్ రాజు తో పరిచయానికి ముందు తనకు పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అలాగే తాను విదేశాలకు వెళ్లి పీహెచ్డీ చదువుకోవాలని అనుకున్నానని, కానీ ఆ తర్వాత మళ్లీ లైఫ్ ఇలా టర్న్ అవుతుందని అస్సలు అనుకోలేదని సరదాగా వ్యాఖ్యలు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నిర్మాత దిల్ రాజు మరియు అనిత దంపతులకి పండంటి మగ బిడ్డ కూడా జన్మనిచ్చాడు. కాగా ఇటీవలే దిల్ రాజు తెలుగు మరియు తమిళం భాషలలో ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటించిన “వారసుడు” అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం దిల్ రాజు తెలుగులో ప్రముఖ దర్శకుడు శంకర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.