Hero Rana: ఏంటి.. రానా హీరో మెటీరియల్ కదా.. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు?

Akashavani

Hero Rana: సాధారణంగా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఉండడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు హీరోలుగా కొనసాగుతున్నారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అక్కినేని కుటుంబం నుంచి దగ్గుబాటి కుటుంబం, మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో వారికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. ఈ విధంగా వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో దగ్గుబాటి రానా ఒకరు. లీడర్ సినిమా ద్వారా రానా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

లీడర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనంతరం పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందారు ఇక బాహుబలి సినిమా తర్వాత ఈయన ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఈ విధంగా హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రానాను ఉద్దేశిస్తూ డైరెక్టర్ గీతాకృష్ణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా గీతాకృష్ణ మాట్లాడుతూ బాగా పొడుగు ఉన్నవారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేరు అలాంటి వారికి ఇండస్ట్రీలో పెద్దగా హిట్ సినిమాలు పడవని వెల్లడించారు.

Hero Rana: బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హీరో మెటీరియల్ కాదు…

 

రానా ఎంతో పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు కావలసినంత ఇన్ఫ్లూయెన్స్ ఉంది.అద్భుతమైన తెలివితేటలు ఉన్నప్పటికీ రానా హీరో మెటీరియల్ కాదని గీతాకృష్ణ హీరో రానా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా రానా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దగ్గుబాటి అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానా చాలా పొడవుగా ఉండటం వల్లే ఈ విధంగా తనని హీరో మెటీరియల్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రానా తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటించారు.ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న రానా త్వరలోనే విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

- Advertisement -