Venkatesh : టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో చాలానే వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో చాలా సినిమాలు మల్టీస్టారర్ సినిమాలే. ఎన్.టి.ఆర్ – ఏ.ఎన్.ఆర్, కృష్ణ – శోభన్ బాబు లాంటి కాంబినేషన్ ఎన్నో వచ్చాయి. అయితే మల్టీస్టారర్ అని అప్పట్లో ఎవరూ ప్రత్యేకంగా చెప్పుకునేవారు కాదు. కానీ రాను రాను హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తే మల్టీస్టారర్ అని చెప్పుకుంటూ బడ్జెట్ పరంగా..మార్కెట్ పరంగా సినిమా మీద బాగా హైప్ తీసుకువచ్చారు. దీన్ని బట్టే కథ కూడా యూనివర్సల్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

director requested dilraju for venkatesh, mahesh
director requested dilraju for venkatesh, mahesh

అదే విధంగా మన టాలీవుడ్‌లో కూడా మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ బాగా మొదలైంది. అయితే ఇలాంటి ఓ మల్టీస్టారర్ తీయాలని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేసుకున్నాడు. లైన్ చెప్పినప్పుడే నిర్మాత దిల్ రాజుకి సార్ ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు కావాలి అని చెప్పాడు. అప్పుడు దిల్ రాజు ..నువ్వు కథ మొత్తం సిద్దం చేయి..ఇద్దరు హీరోలు సంగతి తర్వాత చూద్దాం అని అన్నాడట. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక కథ ఓ నెరేషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ సార్ ఇద్దరు హీరోలు కావాలండీ అని అడగడం రిపీటయింది. అప్పుడు కూడా దిల్ రాజు నువ్వు మొత్తం కథ అయ్యాక చెప్తే ఆ ఇద్దరు హీరోలు అవసరమా కాదా ఆలోచిద్దాం అన్నాడట.

Venkatesh : దిల్ రాజుకి ఏమర్థం కాలేదు.

కథ మొత్తం అయింది. దిల్ రాజు ఫైనల్ వర్షన్ వినడానికి రెడీ అయ్యాడు. నెరేషన్‌కి ముందే మళ్ళీ సేం డైలాగ్. దిల్ రాజుకి ఏమర్థం కాలేదు. ఎందుకిలా ఇద్దరు హీరోలు అని పట్టుపడుతున్నాడు అని ఆలోచించి కథ విన్నాడు. విన్న తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఇంటెన్షన్ అర్థం చేసుకొని దిల్ రాజు ఇద్దరు హీరోలుగా వెంకటేశ్ – మహేష్‌లను అనుకొని వెళ్ళి కథ చెప్పమని చెప్పాడు. అలాగే వెళ్ళి ఇద్దరు హీరోలకి కథ చెప్పి ఒప్పించాడు. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుగా వచ్చి పెద్ద సక్ససె సాధించింది. ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. ఆ తర్వాత నుంచి టాలీవుడ్‌లో బాగా మల్టీస్టారర్స్ రావడం మొదలయ్యాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 6, 2021 at 2:00 సా.