S J Surya : ఖుషీ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటీ ఎవరూ మర్చిపోలేరు. ఆల్ టైం ఫేవరేట్ ఆల్బంగా నిలిచిపోయింది. ఇందులో పవర్ స్టార్ – భూమిక పర్ఫార్మెన్స్ కి అభిమానులే కాదు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో ఉన్న ఇంట్రవెల్ సీన్ అందరికీ ఫేవరేట్ సీన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2001లో వచ్చి పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం కి భారీ లాభాలను తీసుకు వచ్చింది.

director s-j-surya-feeling bad about khushi movie
director s-j-surya-feeling bad about khushi movie

ఈ సినిమాకి మాతృక తమిళంలో వచ్చిన కుశి. ఇందులో విజయ్ – జ్యోతిక జంటగా నటించారు. తమిళంలో 2000 లో వచ్చి అక్కడ మంచి హిట్ సాధించింది. విజయ్ – జ్యోతిక కెరీర్ లోనూ ఈ సినిమా మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇలా తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఖుషీ సినిమా దర్శకుడు ఎస్ జే సూర్యకి ఆల్ టైం ఫేవరేట్ మూవీగా నిలిచింది. అయితే ఇలా రెండు భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాను సూర్య హిందీలో కూడా రూపొందించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే 2003లో హిందీ ఖుషీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కానీ ఆయనకి ఈ సినిమాను హిందీలో చేసి పెద్ద పొరపాటు చేశానని ఆ తర్వాత తెలిసిందట.

S J Surya : హిందీలో ఖుషీ రీమేక్ చేసినందుకు బాధగా ఉందని వెల్లడించాడు.

ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూర్య చెప్పడం ఆశ్చర్యకరం. హిందీలో ఫర్దీన్ ఖాన్ – కరీనా కపూర్ జంటగా నటించారు. అయితే తెలుగు, తమిళ
భాషలలో హిట్ అయినంతగా హిందీలో కాలేదు. బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది కావడంతో ఈ రెండు భాషల కంటే హిందీలో భారీ హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ డిసప్పాయింట్ చేసింది. ఇక ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్ అసలు మెప్పించలేకపోయింది. ఇప్పటికీ ఈ సీన్ విషయంలో దర్శకుడు ఎస్ జె సూర్య ఫీలవుతుంటాడట. మూడు భాషలలో కంటే తెలుగులో ఈ సీన్ అద్భుతంగా వచ్చిందని మిగతా రెండు భాషలలో అంత ఆకట్టుకోలేదని తెలిపాడు. ఇక హిందీలో ఖుషీ రీమేక్ చేసినందుకు బాధగా ఉందని వెల్లడించాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 18, 2021 at 5:00 సా.