Sada : సదాఫ్..అనే అమ్మాయి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు సదా అనే పేరుతో వచ్చింది. సదా అంటే అందరూ బావుండాలి..అంతా మంచే జరగాలి..అనే పాజిటివ్ వైబ్స్ కలిగిన పేరు. పేరుకు తగ్గట్టే సదా బయటకూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. మంచి పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకుంది. మోడల్ అయిన సదాని టాలెంటెడ్ డైరెక్టర్ తేజ 2002 లో వచ్చిన జయం సినిమాతో పరిచయం చేశాడు. ఇందులో నితిన్ హీరో. ఆయనకి మొదటిసినిమా. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఇదే సినిమా తమిళ వర్షన్ లో కూడా సదానే హీరోయిన్ గా నటించింది. అంతేకాదు మొదటి సినిమాతోనే ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మారింది.

director teja behaves very harshly regarding work says sada-
director teja behaves very harshly regarding work says sada-

వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రాణం సినిమాతో సదా మరో స్థాయికి చేరుకుంది. సినిమా ఫ్లాప్ గా మిగిలినప్పటికి ప్రాణం సినిమా సదాలోని అసలు నటిని బయటకు తీసుకు వచ్చింది. తమిళంలో అనియన్, ప్రియసఖి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. తెలుగులో బాలయ్య, జూనియర్ ఎన్.టి.ఆర్, ఉదయ్ కిరణ్, మంచు మనోజ్, సిద్దార్థ్ లాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీని సాధించింది. మూడు భాషల్లో ఇన్ని సినిమాలు చేసిన తేజ దగ్గర ఉండే డిసిప్లైన్, స్ట్రిక్ట్ నెస్ ఇంకెక్కడా చూడలేదట.

Sada : చావు అంచులవరకు వెళ్ళి వచ్చిందట సదా.

ఆయన తీసే సన్నివేశాలు రియలిస్టిక్ గా రావడానికి చాలా వరకు సీన్స్ చాలా నేచురల్ గా తెరకెక్కిస్తాడని చెప్పింది సదా. జయం సినిమా షూటింగ్ సమయంలో ఓ సీన్ కోసం ఒక గోడపై నుంచి దూకాలి. ఆ విషయం ముందు చెప్పలేదట. తీరా సీన్ షూట్ చేసే సమయంలో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మా..నాన్నలను చూసిందట. నాన్న వద్దంటే అమ్మ ఏం పర్లేదు క్యాజువల్‌గా దూకేయ్ అని చెప్పిందట. అమ్మ చెబితే ఏదైనా చేయడానికి వెనకాడని సదా చెప్పినట్టుగానే గోడ పైనుంచి దూకేసిందట. అప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఔనన్నా కాదన్న చిత్రం షూటింగ్ లో కూడా చావు అంచులవరకు వెళ్ళి వచ్చిందట సదా.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 30, 2021 at 8:57 ఉద.