Krishna : సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ అగ్ర నటుడుగా ఒక వెలుగు వెలిగారు. సినీ కెరీర్ ప్రారంభించిన తర్వాత 1964కు ముందు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు, సహాయ పాత్రలు చేశారు. వాటి ద్వారా కాస్త గుర్తింపు రావడంతో ఆయనకు 1964-65లో హీరోగా తొలి సినిమా తేనెమనసులో అవకాశం వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆరు నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన కన్నెమనసులు సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ నటించాడు. ఇక మూడవ సినిమాగా వచ్చిన గూఢచారి 116 తో చిత్ర పరిశ్రమలో హీరోగా సెటిల్ అయ్యారు. ఈ సిమిమా మొదటి తెలుగు జేమ్స్‌బాండ్ తరహాలో వచ్చిన సినిమా.

do you know which actor helped for krishna-vijaya nirmala love marriage
do you know which actor helped for krishna-vijaya nirmala love marriage

కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్ తో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. 1967లో కృష్ణ నటించిన ఆరు సినిమాలు విడుదలయి సక్సెస్ సాధించడం గొప్ప విషయం. వీటిలో ఇద్దరు మొనగాళ్లు అన్న జానపద చిత్రం, బాపు-రమణల తొలి చిత్రం, విజయనిర్మలతో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి కూడా ఉంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్దారు. అప్పటికే కృష్ణకి వివాహం అయింది. అయినా మళ్ళీ ఆయన విజయ నిర్మలతో ప్రేమలో పడటం అందరికీ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్న క్రమంలో వీరి ప్రేమ ఇంకా బలపడింది.

Krishna : పెళ్ళి చేసిన సమయంలో దగ్గరుండి అన్నీ చూసుకున్న నటుడు అప్పటి హీరో చంద్ర మోహన్.

సాక్షి సినిమా తర్వాత సర్కార్ ఎక్స్‌ప్రెస్ అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ.. విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో రెండేళ్ళ తర్వాత అంటే 1969లో తిరుపతిలో పెళ్ళిచేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయనిర్మలకూ ఇది రెండవ పెళ్ళి. కృష్ణ రెండవ పెళ్ళి చేసుకోవడం మొదటి భార్య – పిల్లలు, విజయనిర్మల కుమారుడు నరేష్‌లపై ప్రభావం చూపింది. ఈ విషయంలో కొంతమంది వీరిని వేలెత్తి చూపించారట. అయితే మొదటి భార్య ఇందిర విజయనిర్మలను కుటుంబ సభ్యురాలిగా స్వీకరించడమే కాక ఆమెను ఆదరించింది. ఇందిర పిల్లలైన మహేష్, ప్రియదర్శిని తరచు విజయనిర్మల ఇంటికి వచ్చేవారని, స్వంత కొడుకు నరేష్‌కీ వాళ్ళకీ ఏనాడూ భేదం చూడలేదని విజయనిర్మల చెప్పిన సందర్భాలున్నాయి. అయితే వీరికి రెండవ పెళ్ళి చేసిన సమయంలో దగ్గరుండి అన్నీ చూసుకున్న నటుడు అప్పటి హీరో చంద్ర మోహన్. ఈ విషయాన్ని గతంలో వీరు వెల్లడించిన సందర్భాలున్నాయి కూడా.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 2, 2021 at 8:48 ఉద.