Manirathnam : సౌత్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అంటే ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళంలో అద్భుతమైన చిత్రాలు తీసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప దర్శకులు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, ఇతర టెక్నీషియన్స్ ఎప్పుడూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలలో చిన్న వేషం ఇచ్చినా చాలు అని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి దర్శకుడు స్వయంగా అవకాశం ఇచ్చినా తన భార్య స్టార్ హీరోయిన్ అయిన సుహాసినీ మాత్రం ఇప్పటి వరకు ఆయన సినిమాలలో నటించలేదు. అందుకు కారణం కూడా ఉందని కొన్ని సందర్భాలలో ఇద్దరు చెప్పారు.

Do you know why Suhasini is not going to act in movies directed by Mani Ratnam ..?
Do you know why Suhasini is not going to act in movies directed by Mani Ratnam ..?

మణిరత్నం ముంబై లోని జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీయే చేశారు. ఆయన తండ్రి రత్నం అయ్యర్ వీనస్ స్టూడియో కి అధినేత. దాంతో సినిమా వాళ్ళు తరచుగా అక్కడికి వస్తూపోతూ ఉండటంతో సినిమాల మీద మణిరత్నం కి ఆసక్తి ఏర్పడింది. దాంతో ఎవరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేయకుండానే దర్శకుడయ్యారు. టాలెంట్, పట్టుదల, కృషి ఉంటే అనుభవం అవసరం లేదని చెప్పడానికి ఆయనే ఉదాహరణ. ఇక మణిరత్నం మొదటి సినిమా కన్నడలో వచ్చిన పల్లవి అనుపల్లవి. ఈ సినిమా తర్వాత మౌన రాగం, నాయకన్, రోజా, బొంబాయి, ఇద్దరు, అంజలి, గీతాంజలి, దళపతి లాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు.

Manirathnam : నా డైరెక్షన్ లో నటించమని అడగలేకపోయాని తెలిపారు.

మణిరత్నం తీసిన సినిమాలలో ఇద్దరు బాగా ఇష్టం అని చెప్పారు. అందులో మోహన్‌లాల్ నటనకు గాను జాతీయ బహుమతి వస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ రాకపోవడంతో
కొంత నిరుత్సాహపడ్డాడు. ఆయన ఎంతో ఇష్టంగా తీసిన ‘కడలి ‘ కూడా ఈ విషయంలో ఎంతో నిరుత్సాహాపరిచింది. కాగా ఇన్ని సినిమాలలో ఒక్క సినిమా కూడా సుహాసినీ
నటించకపోవడం ఆశ్వర్యకరం. ఇదే ప్రశ్న సుహాసినీకి ఎదురవగా..నాకెందుకో ఆయన దర్శకత్వంలో నటించాలని అనిపించలేదని సింపుల్ గా చెప్పారు. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు
కూడా లేవని తెలిపారు. మణిరత్నం కూడా తన కోసం ఓ మంచి క్యారెక్టర్ రాయలనిపిస్తుంది గానీ ఎప్పుడు నా డైరెక్షన్ లో నటించమని అడగలేకపోయాని తెలిపారు. అంటే ఇక్కడ
బలమైన కారణాలు అంటూ లేవు అని అర్థమవుతోంది. మరి రానున్న రోజుల్లోనైన ఇద్దరు కలిసి సినిమా చేస్తారా లేదా చూడాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 10, 2021 at 9:19 ఉద.