Viral Video: సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు వారిలో ఉన్న టాలెంట్ సోషల్ మీడియా వేదికగా బయట పెడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు యూట్యూబ్ చానల్స్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నైనికా తనయ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నారు.పట్టుమని పది సంవత్సరాలు కూడా లేనటువంటి ఈ చిన్నారులు తమ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకున్నారు.
ఇలా తమ డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ప్రతి ఒక్క పాటకు అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేస్తూ వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఏకంగా 2.9 మిలియన్ సబ్స్క్రైబర్లు లను సంపాదించుకున్నారు. ఈ విధంగా ఈ సిస్టర్స్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరు అమెరికాలో నివసిస్తున్నప్పటికి ట్రెండింగ్ లో ఉన్న తెలుగు పాటలకు అద్భుతమైన డాన్స్ చేస్తూ ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ అందరిని సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేయగా తాజాగా బుల్లెట్ సాంగ్ తో మరోసారి అభిమానుల ముందుకు వచ్చారు.

Viral Video: ట్రెండ్ అవుతున్న బుల్లెట్ సాంగ్
లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ది వారియర్ చిత్రం నుంచి కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు అనే పాటను హీరో శింబు ఎంతో అద్భుతంగా పాడారు. ఇలా ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా నైనికా తనయా కూడా ఈ పాటకు అద్భుతమైన డాన్స్ చేస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే సిస్టర్స్ ఇలా డాన్స్ చేస్తున్నారు అంటే ఇక వీళ్ళు సినిమాలలోకి, లేదా ఏదైనా డాన్స్ షో లలో పాటిస్పేట్ చేస్తే విజయం వీరిదేనని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.