Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. 60 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వ్రజాలు, వెండి వస్తువులు దొంగలు దోచుకెళ్లారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు ఇంటి దొంగల పనే అని వారు అని తేల్చారు పోలీసులు.
ఎంతో నమ్మకంగా ఉన్న ఇంట్లో పని వారు ఎవరూ లేని సమయంలో వస్తువులను కాజేయడంతో పాటు గా వాటిని అమ్మేసి ఆస్తులు కూడా పోగు జేసుకున్నారు.దాంతో ఇప్పుడు కటకటాల పాలయ్యారు. కాగా ఆ మొత్తం చోరీకి సూత్రధారులు ఆ ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అని తేల్చారు. ఐశ్వర్య నివాసంలో 18 ఏళ్లుగా ఎంతో నమ్మకస్తురాలిగా పనిచేసిన మండవేలికి చెందిన ఈశ్వరితో పాటు మరో లక్ష్మి, డ్రైవర్ వెంకటేశ్ ఈ చోరీకి పాల్పడ్డారు. వీరు ముగ్గురు మరో ముగ్గురి సహాయంతో ఇవన్నీ చేశారు. దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు పలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఐశ్వర్య ఇంట్లోని 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులుతో పాటు కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో్ రూ.నాలుగు లక్షల విలువైన డైమండ్ సెట్స్, పురాతన బంగారు ముక్కలు , నవరత్న సెట్స్ , గాజులు చోరీకి గురైనట్లు తేలింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇకపోతే ఐశ్వర్య రజినీకాంత్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత మళ్లీ కొద్దీ రోజులకే విడాకులను మళ్లీ రద్దు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయంలో అభిమానులు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు.