kritika jaikumar: కొంతమంది నటీనటులకి వచ్చి రావడంతోనే స్టార్ నటీనటులతో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఉపయోగించుకోలేక నాశనం చేసుకున్నటువంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే తెలుగులో ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం చిత్రం ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. అయితే ఈ దృశ్యం చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన వెంకటేష్ మరియు మీనాలతో పాటు వీరి కూతురి పాత్రలలో నటించిన ఏస్తర్ అనిల్ అలాగే అంజు పాత్రలో నటించిన కృతిక జయ కుమార్ తదితరులకు కూడా మంచి గుర్తింపు లభించింది.
కాగా దృశ్యం మొదటి భాగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎస్థర్ అనీల్ ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలలో అందాల ఆరబోతతో కుర్రకారపై కునుకు లేకుండా చేస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరో పెద్దకూతురు పాత్రలో నటించిన కృతిక జై కుమార్ మాత్రం సినిమా ఆఫర్ల కోసం బాగానే ఇబ్బందులు పడుతోంది. అయితే దృశ్యం చిత్రంలో నటించిన తర్వాత కృతిక జై కుమార్ కి తెలుగులో రెండు, మూడు ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో కృతిక జై కుమార్ కూడా చేసేదేమీ లేక ప్రస్తుతం ఆఫర్లు లేక ఇంటి పట్టునే ఉంటోంది.
అయితే నటి కృతిక జై కుమార్ కి సినిమా ఆఫర్లు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో నటి కృతిక జై కుమార్ కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో యోగా క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా కూడా పని చేస్తొంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫోటోషూట్లలో కూడా పాల్గొంటూ తన అందచందాల ఆరబోతతో ఘాటుగా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. అయినప్పటికీ సినిమా ఆఫర్లను మాత్రం అందుకోలేకపోతోంది.