Eesha rebba : తెలుగమ్మాయిలకు అందం లేదా..వాళ్ళు ఎక్స్‌ఫోజింగ్ చేయరా..వాళ్ళలో టాలెంట్ లేదా..అవకాశం ఇస్తే మేమూ ప్రూవ్ చేసుకుంటాము. గతంలో ఈ మాటలన్నది ఒక తెలుగమ్మాయి. ఆమె హీరోయిన్‌గా నటించిన డెబ్యూ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నానితో సినిమా చేసింది. ఈ సినిమాలో గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈమెకి ఆశించిన అవకాశాలు దక్కలేదు. అందరు మంచి హీరోయిన్ అవుతుంది. మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రశంసించారు. కానీ ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. ఆ అమ్మాయే మాధవీలత.

eesha-rebba is unable to get success in tollywood

నచ్చావులే సినిమాతో హీరోయిన్‌గా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా యంగ్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటుందని అందరు భావించారు. కానీ ఇక్కడ ముంబై భామల మీద ఉండే ఆసక్తి మన తెలుగమ్మాయిల మీద ఉండదు. అందుకే ఈమె స్టార్ గా ఎదగలేకపోయింది. ఈ లిస్ట్లోనే మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఉంది. టాలీవుడ్ లో సుమంత్ అశ్విన్ నటించిన ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బందిపోటు, అమితుమీ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

Eesha rebba : సెకండ్ లీడ్స్ వచ్చినా ఉపయోగపడం లేదు.

కానీ హీరోయిన్ గా సెటిలవలేకపోయింది. సెకండ్ లీడ్స్ వచ్చినా అవి అమ్మడికి ఉపయోగపడ లేదు. ఈమె చెప్పేది కూడా తెలుగమ్మాయి కావడం వల్లే ఇక్కడ అంతగా అవకాశాలు రావడం లేదని. ముంబై మోడల్స్, హీరోయిన్స్ కి ఇచ్చే అవకాశాలలో సగం మాకు ఇచ్చిన మన లోకల్ టాలెంట్ బయటకు వస్తుంది. కానీ ఆ అవకాశం తెలుగమ్మాయిలకు దక్కడం లేదు అంటోంది. అయితే తెలుగమ్మాయిలు ఒక సినిమా ఓకే చేయడానికి చాలా సమయం తీసుకుంటారని ఒక పట్టాన ప్రాజెక్ట్ కి ఓకే చెప్పరనేది కొందరు మేకర్స్ వైపు నుంచి కంప్లైంట్. అదే ముంబై హీరోయిన్స్ అయితే వెంటనే ప్రాజెక్ట్ ఓకే చెప్తారనేది వారి మాట. ఏదేమైనా మన తెలుగమ్మాయిలకి మాత్రం ఈ విషయంలో సరైన న్యాయం జరగడం లేదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 11, 2021 at 9:05 ఉద.