Sai dharam tej : మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతక ముందు చిత్రలహరి, ప్రతీరోజు పండగే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. హ్యాట్రిక్ సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో వచ్చాడు. గత ఏడాది మొత్తం కరోనాతో ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలించిన తర్వాత అందరికంటే ముందు సాయి ధరం తేజ్ ధైర్యం చేసి సోలో బ్రతుకే సో బెటర్ గత ఏడాది డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

effect-on-sai-dharam-tej-market
effect-on-sai-dharam-tej-market

సినిమాకి హిట్ టాక్ వచ్చినప్పటికి 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ వల్ల సినిమాకి రావాల్సిన వసూళ్ళు రాలేదు. హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్న సాయి ధరం తేజ్ కి కరోనా గట్టి దెబ్బ కొట్టింది. దాంతో సాయి ధరం తేజ్ మార్కెట్ మీద కాస్త గట్టిగానే ప్రభావం పడింది. అయితే ఆ ప్రభావం ఇంకాస్త గట్టిగా ప్రభావం చూపించబోతుందని మాట్లాడుకుంటున్నారు. సాయి ధరం తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా రిపబ్లిక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్ సినిమా మీద బాగానే అంచనాలు పెంచేసింది. ఇక టీజర్ మరో హిట్ సాయి ధరం తేజ్ కి దక్కబోతోందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Sai dharam tej : సాయి ధరం తేజ్ మీద మాత్రమే కాదు మిగతా టాలీవుడ్ స్టార్ హీరోల మీద కూడా..!

అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా లేక సోలో బ్రతుకే సో బెటర్ మాదిరిగా పే ఫర్ వ్యూ పద్దతిలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందా.. అయితే ఈ ప్రభావం సాయి ధరం తేజ్ మార్కెట్ మీద ఎంతగా పడుతుందో అని మాట్లాడుకుంటున్నారట. అయితే ఈ కరోనా ప్రభావం ఒక్క సాయి ధరం తేజ్ మీద మాత్రమే కాదు మిగతా టాలీవుడ్ స్టార్ హీరోల మీద కూడా పడటం ఖాయమని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి మళ్ళీ టాలీవుడ్ లో పరిస్థితులన్నీ ఎప్పుడు చక్కబడతాయో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 27, 2021 at 9:05 సా.