Athadu : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అతడు ఒక గొప్ప సినిమా. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించాడు. స్వయం వరం సినిమాతో కథా, మాటల రచయితగా సినీ ప్రస్థానం మొదలు పెట్టిన త్రివిక్రం నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ, మన్మధుడు లాంటి సూపర్ హిట్ సినిమాలకి కథ, మాటలు అందించాడు. ఆ తర్వాత లవర్‌బాయ్ తరుణ్ – శ్రియ శరణ్ జంటగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ నువ్వే నువ్వే తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్‌తో ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపార వేత్త అయిన మురళీమోహన్ తన సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ మీద నిర్మించారు.

Even if Athadu is a blockbuster movie, did the producer lose ...?
Even if Athadu is a blockbuster movie, did the producer lose …?

మహేష్ బాబుని అప్పటి వరకు చూడని ఓ కొత్త కోణంలో దర్శకుడు త్రివిక్రం చూపించాడు. ఇందులో మహేష్ ని చూపించిన విధానం ఒకరకంగా హాలీవుడ్ సినిమా స్థాయిలో చూపించాడు. అభిమానులకే కాక ప్రక్షకులను అతడు విపరీతంగా ఆకట్టుకుంది. ఫైట్స్, మ్యూజిక్ అధ్భుతం అని అందరూ చెప్పుకున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు..విమర్శకులు ప్రశంసించారు. ఇంతమంది మన్నలను పొందిన అతడు బిగ్ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లో ఈ సినిమాకి మంచి స్థానం కూడా ఉంటుంది. అయితే ఫైనల్ గా లాభాలు మాత్రం నిర్మాతకి తీసుకురాలేదనే టాక్ వినిపించింది.

Athadu : అతడు నిర్మాత విషయంలోనూ అదే జరిగింది.

అందుకు కారణం ఓవర్ బడ్జెట్ కావడమే. ముందు అనుకున్న బడ్జెట్ కంటే చాలా పెట్టాల్సి వచ్చిందట. ఇది ఒకరకంగా దర్శకుడి వైఫల్యమే అని చెప్పుకున్నారు. రెండవ సినిమా ఓ పెద్ద స్టార్‌తో చేయవలసి వచ్చినప్పుడు బడ్జెట్ లిమిటేషన్స్ చాలా ముఖ్యం. హిట్ అని టాక్ వచ్చినా దానికి తగ్గ లాభాలు రాకపోతే నిర్మాత మరో సినిమా చేయాలంటే ధైర్యం చేయలేడు. ఈ నిర్మాత విషయంలోనూ అదే జరిగింది. అతడు భారీ లాభాలు తెచ్చి ఉంటే వెంటనే మరో సినిమా చేసేవారు. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే త్వరలో ఈ నిర్మాణ సంస్థలో మళ్ళీ ఓ సినిమా మొదలవబోతోందని టాక్ వినిపిస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని సంస్థ అధినేత మురళీమోహన్ చెప్పుకొచ్చారు. కరోనా పరిస్థితులు చక్కబడితే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 4, 2021 at 12:00 సా.