Jagapathi babu : జగపతి బాబు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ కాలంలో శోభన్ బాబు ఎలాంటి సినిమాలు చేశాడో..అదే జోనర్ సినిమాలు జగపతి బాబు చేసి స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. డాన్సులు, ఫైట్లు అవసరం లేకుండా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలలోనే జగపతి బాబు భారీ హిట్స్ అందుకున్నాడు. తన ఖాతాలో ఎక్కువగా సూపర్ హిట్సే ఉన్నాయి. ఒకవైపు ఇలా ఫ్యామిలీ స్టోరి సినిమాలు చేస్తూనే ప్రయోగాలు చేశాడు.

everyone thought that jagapathi-babu-life is closed...!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో గాయం సినిమా చేసి నటన పరంగా తనలోని మరో కోణాన్ని బయట పెట్టాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతపురం సినిమాలో చేసిన పాత్ర జగపతి బాబు కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాత్ర బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ పోషించాడు. అయితే జగపతి బాబులా నేను చేయలేకపోయానని చెప్పడం గొప్ప విషయం. ఇలాంటి ప్రశంసలు అందుకున్న జగపతి బాబు కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది.

Jagapathi babu : ఇండస్ట్రీలో జగపతి బాబు అంత లగ్జరీగా ఏ హీరో లైఫ్ లీడ్ చేయలేదు.

ఇండస్ట్రీలో తనంత లగ్జరీగా ఏ హీరో లైఫ్ లీడ్ చేయలేదు. అలాంటిది చేతిలో సినిమాలు లేక కారు, ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఇక ఈయన కెరీర్ క్లోజ్ అనుకున్న వాళ్ళూ ఉన్నారు. కానీ లెజెండ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు స్టార్ హీరో రేంజ్ లో సత్తా చాటుతున్నారు. ఆయన కోసం విభిన్నమైన పాత్రలు క్రియేట్ అవుతున్నాయి. స్టైలిష్ విలన్..ఊర మాస్ విలన్..క్లాస్ ఫాదర్..ఒకటేమిటి ఎలాంటి పాత్ర రాసినా అందులో జగపతి బాబు తప్ప మరో ఆప్షన్ లేదనే విధంగా ఆయన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత జగపతి బాబు రేంజ్ మరెవరీకీ లేదనే చెప్పాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 28, 2021 at 10:30 సా.