Nagachaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక నటితో రిలేషన్ లో ఉన్నారు అంటూ ఈయన గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలకు అనుగుణంగానే నాగచైతన్య హీరోయిన్ తో కలిసి పలు సందర్భాలలో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ లండన్ లో ఓ రెస్టారెంట్ లో జంటగా కనిపించిన సంగతి తెలిసిందే.
ఇలా వీరిద్దరూ లండన్ లో జంటగా కనిపించడంతో వీరి గురించి వచ్చే వార్తలు నిజమేనని పెద్ద ఎత్తున ఈ వార్తలను వైరల్ చేశారు. అయితే ఈ వార్తలపై శోభిత స్పందిస్తూ ఆ వాస్తవమని కొట్టిపారేసినప్పటికీ తరచూ వీరి గురించి మాత్రం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి అయితే తాజాగా మరోసారి నాగచైతన్య శోభిత రిలేషన్ లో ఉన్నారంటూ మరో వార్త వైరల్ గా మారింది అయితే వీరిద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటోలు మ్యాచ్ అవ్వడంతోనే ఇద్దరు మరోసారి అడ్డంగా దొరికిపోయారని ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అంటూ నేటిజైన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఒకే బుక్కు గురించి చెప్పిన చైతు శోభిత…
కొన్ని రోజుల క్రితం నాగచైతన్య గ్రీన్ లైట్స్ అనే పుస్తకం గురించి చెప్తూ..జీవితానికి ఒక ప్రేమ లేఖ,మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు మాథ్యూ మాక్కనౌగే చాలా థాంక్స్ .. ఈ పఠనం నాకు గ్రీన్ లైట్ ను నింపింది.. రెస్పెక్ట్ సర్ అని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అదే బుక్ ను శోభితా షేర్ చేస్తూ..గత కొన్ని నెలల్లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకం. ఎంత అపురూపమైన జీవిత కథ. ఒక పాట లాగా, నిజంగా. విపరీతమైన నవ్వు మరియు స్వాతంత్య్రాన్ని సంపాదించిన రుచిలా ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఇది చూసిన నేటిజన్స్ వీరిద్దరూ ఒకే బుక్కు గురించి ఇలా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేయడంతో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ మరోసారి వీరి గురించి వార్తలను వైరల్ చేస్తున్నారు.