Rashmika mandanna : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కలిసి రెండు సినిమాలలో నటించారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్. ఈ రెండు సినిమాలలో గీత గోవిందం 100 కోట్ల క్లబ్ లో చేరగా డియర్ కామ్రేడ్ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయినా అభిమానులకు రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ అంటే ఎందుకంత క్రేజ్.. మళ్ళీ మళ్ళీ వాళ్ళ రొమాన్స్ చూడాలని ఎందుకనుకుంటున్నారు. అని హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం ఒక నెటిజన్. తాజాగా రష్మికని నెటిజన్ డైరెక్ట్ గానే అడిగేశాడు.

fans wish to see rashmika-mandanna vijay devarakonda on screen once again
fans wish to see rashmika-mandanna vijay devarakonda on screen once again

సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని కాంబినేషన్స్ కి అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. సినిమా హిట్టా.. ఫ్లాపా అని చూడరు. ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసే రొమాన్స్ కోసం ఆసక్తిగా ఉంటారు. అలాంటి జంట రష్మిక మందన్న – విజయ్ దేవరకొండలది. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ కంటెంట్ తో తెరకెక్కి సెన్షేషనల్ హిట్ అందుకున్న తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక తో కలిసి గీత గోవిందం సినిమా చేశాడు. ఈ సినిమాలో మేడం.. మేడం.. ప్లీజ్ మేడం అంటూ అమాయకంగా రష్మిక మనసు ఆకట్టుకునే పాత్రలో కనిపించాడు.

Rashmika mandanna : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ రెడీగా ఉన్నారట.

ఈ సినిమాతో ఇద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్. దాంతో డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. ఈ రెండు సినిమాలలో రష్మిక – విజయ్ ల రొమాన్స్ హైలెట్ గా నిలిచింది. ఇప్పటి వరకు విజయ్ నటించిన హీరోయిన్స్ లో రష్మిక బెస్ట్ పెయిర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే మరోసారి స్క్రీన్ మీద వీరి రొమాన్స్ చూడాలని ఆతృతగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఒక అభిమాని రష్మికని డైరెక్ట్ గా అడిగేశాడు. దాంతో రష్మిక .. నేను – విజయ్ రెడీగా ఉన్నాం. కథ రెడీగా ఉంటే కలిసి సినిమా చేయడానికి ఓకే అనేసింది. దాంతో మేకర్స్ ఈ ఇద్దరి కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారట.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 30, 2021 at 8:00 ఉద.