Gangavva: గంగవ్వ పరిచయం అవసరం లేని పేరు.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాసకు మళ్లీ జీవం పోసిన గంగవ్వ తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ పాపులారిటీతో గంగవ్వ ఏకంగా బిగ్ బాస్ అవకాశం అందుకున్నారు.బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా పలుకు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గంగవ్వ తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పారు.
ఈ విధంగా గంగవ్వ చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…ఉగాది పండుగను పురస్కరించుకొని ఒక న్యూస్ ఛానల్ గంగవ్వతో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కొందరి రాజకీయ నాయకుల ఫోటోలను చూపిస్తూ జాతకాలు చెప్పమని చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోటోలు చూపించివారి జాతకం చెప్పమని చెప్పగా గంగవ్వ నేను వీరి జాతకం చెప్పలేను వీరికి శని ఉందంటూ, చంద్రబాబుకు గ్రహణం పట్టింది అంటూ వారి జాతకాలని చెబుతుంది.
Gangavva: నా తప్పు ఏమీ లేదు…
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసినటువంటి పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో గంగవ్వ చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెబుతూ మరొక వీడియోని షేర్ చేశారు. న్యూస్ ఛానల్ వారు అలా చెప్పమంటేనే చెప్పానని తనకు ఏ విషయం తెలియదనీ,వాళ్ల చెప్పమంటేనే చెప్పాను ఇందులో నా తప్పు ఏమీ లేదు అంటూ ఈమె అందరికీ క్షమాపణలు కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.